పరిశోధనలు అట్టడుగు వర్గాల అభ్యున్నతికి దోహదం | - | Sakshi
Sakshi News home page

పరిశోధనలు అట్టడుగు వర్గాల అభ్యున్నతికి దోహదం

Aug 25 2026 1:21 AM | Updated on Aug 25 2026 1:21 AM

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: అట్టడుగు వర్గాల అభ్యున్నతికి పరిశోధనలు దోహదపడాలని పీయూ వీసీ శ్రీనివాస్‌ అన్నారు. పీయూ ఇంగ్లిష్‌ విభాగం రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ మనోజ్‌ ఆధ్వర్యంలో ఎంవీ సిద్ధార్థ ‘వాయిస్‌ ఆఫ్‌ ది సబాల్టర్న్‌’ అంశంపై పరిశోధన పత్రం సమర్పించి పీహెచ్‌డీ పట్టా పొందారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ సమాజంలోని అసమానతలను తగ్గించేలా పరిశోధనలు సాగాలని సూచించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ రమేష్‌బాబు, హెచ్‌ఓడీ మాళవి, శ్రీలత పాల్గొన్నారు.

ఫార్మసీ రంగంలో ఆధునిక పరిశోధనలు

పీయూ ఫార్మసీ కళాశాల అధ్యాపకుడు ప్రభాకర్‌రెడ్డి రచించిన ‘కంప్యూటర్‌ సిమ్యులేషన్స్‌ ఇన్‌ ది ఫార్మాస్యూటికల్‌ ఇండస్ట్రీ’ పుస్తకాన్ని వీసీ శ్రీనివాస్‌ ఆవిష్కరించారు. ఫార్మసీ రంగ అభివృద్ధికి ఆధునిక సాంకేతికత, పరిశోధనలు కీలకమని, అధ్యాపకులు బోధనతో పాటు పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు.

పరీక్ష కేంద్రాల్లో వీసీ తనిఖీ

పీయూలో బీఫార్మసీతో పాటు వివిధ గ్రూపుల విద్యార్థులకు సోమవారం పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. పీజీ కళాశాల, ఫార్మసీ కళాశాల పరీక్ష కేంద్రాలను వీసీ శ్రీనివాస్‌ తనిఖీ చేశారు. కంట్రోలర్‌ ప్రవీణ, ప్రిన్సిపాళ్లు మధుసూదన్‌రెడ్డి, ఈశ్వర్‌కుమార్‌, రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement