జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఉమ్మడి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని పెండింగ్ ప్రాజెక్టుల సాధన సమితి జేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం టీఎన్‌జీఓ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలకుల నిర్లక్ష్యం, పక్షపాతంతో ప్రాజెక్టులు ఏళ్లుగా పెండింగ్‌లో ఉండటంతో రైతులు, ప్రజలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేసి సాగు, తాగునీరు అందించాలని కోరారు. పాలమూరు ప్రయోజనాలను దెబ్బతీసే డిండి ఎత్తిపోతల పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ ప్రాజెక్టులపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు మంగళవారం జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్‌లో మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం హాజరవుతారని చెప్పారు. ఉమ్మడి జిల్లా నుంచి రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.


