రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు మహిళా జట్టు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు మహిళా జట్టు ఎంపిక

Aug 24 2026 1:31 AM | Updated on Aug 24 2026 1:31 AM

నారాయణపేట: జిల్లా సీనియర్‌ మహిళా కబడ్డీ జట్టు ఎంపికలు ఆదివారం జిల్లాకేంద్రంలోని స్టేడి యం గ్రౌండ్‌లో ఉత్సాహంగా జరిగాయి. జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఎంపికలకు జిల్లాలోని అన్ని మండలాల నుంచి సు మారు 100 మంది క్రీడాకారిణులు పాల్గొని తమ ప్రతిభ చాటారు. చక్కటి ప్రతిభ కనబర్చిన క్రీడాకారిణులను జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. వచ్చే నెల సూర్యాపేట జిల్లాలో జరగనున్న రాష్ట్రస్థాయి సీనియర్‌ మహిళా కబడ్డీ పోటీల్లో జిల్లా జట్టు పాల్గొననుంది.రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చే లా క్రీడాకారిణులను ఎంపిక చేసినట్లు జిల్లా కబడ్డీ అసోసియేషనన్‌ అధ్యక్షుడు నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. 14 మంది క్రీడాకారిణులను ప్రధాన జట్టుగా, మరో 8 మందిని అదనపు క్రీడాకారిణులుగా.. మొత్తం 22 మందిని రాష్ట్రస్థాయి పోటీలకు సిద్ధం చేయనున్నామని తెలిపారు. ఎంపిక కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా లయన్‌ హరినారాయణభట్టడ్‌, జిల్లా కబడ్డీ అసోసియేషనన్‌ ఉపాధ్యక్షుడు నర్సింహులు, పీఈటీలు వెంకటప్ప, సాయినాథ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement