పంట వివరాలు నమోదు చేయించాలి | - | Sakshi
Sakshi News home page

పంట వివరాలు నమోదు చేయించాలి

Aug 23 2026 2:04 AM | Updated on Aug 23 2026 2:04 AM

నారాయణపేట ఎడ్యుకేషన్‌: రైతులు తాము సాగు చేసిన పంటల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్‌ సూచించారు. శనివారం మండలంలోని ఏక్లాస్‌పూర్‌లో రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వానాకాలం పంట వివరాలు డిజిటల్‌ క్రాప్‌ బుకింగ్‌ మొబైల్‌ యాప్‌లో సర్వేయర్ల ద్వారా నిర్వహిస్తున్నామని.. వారికి చెప్పి వివరాలను తప్పక నమోదు చేయించాలన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి దినకర్‌, వ్యవసాయ విస్తరణ అధికారి రాజేష్‌, సర్వేయర్‌ తిమ్మప్ప, సర్పంచ్‌ చంద్రశేఖర్‌, ఆనంద్‌, ఉమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

నారాయణపేట: వానాకాలం–2026 పంట కాలంలో తెలంగాణ ప్రభుత్వం సూచించిన ఏడు సన్న రకాల వరి విత్తనాలు సాగు చేసిన రైతులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి సక్రియా నాయక్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు విత్తనాలను ఏ దుకాణం నుంచి కొనుగోలు చేశారో అక్కడికి వెళ్లి తమ వివరాలను నమోదు చేయించుకోవాలని, సొంతంగా వరి విత్తనాలను సమకూర్చుకుని సాగు చేసిన రైతులు సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారికి ధ్రువీకరణ పత్రం సమర్పించాలన్నారు. ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేయని రైతుల నుంచి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement