మక్తల్: క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని సైక్లింగ్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాలం అన్నారు. ఆదివారం పట్టణంలో ఉమ్మడి జిల్లాస్థాయి సైక్లింగ్ పోటీలు నిర్వహించి విజేతలకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేసి మాట్లాడారు. యూత్ గేమ్ రాష్ట్రస్థాయి పోటీల్లో సైక్లింగ్‌కు 76 మంది బాలికలు పాల్గొనగా.. 24 మంది ఎంపికయ్యారన్నారు. వీరు సెప్టెంబర్ రెండోవారంలో హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. సంఘం ఉపాధ్యక్షుడు శివకుమార్, పీడీలు, పీఈటీలు అంబ్రేష్, రేణు, అవంతి, బాల్‌రెడ్డి, త్రివేణి, యాదగిరి పాల్గొన్నారు.
పాముకాటుకు
చిన్నారి బలి
దామరగిద్ద: పాలబుగ్గల పసిపాప పాముకాటుకు బలైన విషాదఘటన శనివారం రాత్రి మండలంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. మండలంలోని మల్‌రెడ్డిపల్లికి చెందిన మాణిక్యప్ప, పద్మమ్మ కుమారుడు శివకార్తికేయ(18 నెలలు) రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో చేతిపై పాము కాటు వేసింది. బాలుడు తెల్లవారుజామున దాహం వేస్తుందని చెప్పడంతో తల్లిదండ్రులు నీళ్లు తాపించారు. గదిలో పాము ఉండటం, చిన్నారి చేతికి పాముకాటు వేసినట్లు గుర్తించి చికిత్స నిమిత్తం నారాయణపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు సూచన మేరకు మహుబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలిస్తుండగా బాలుడు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదిలా ఉండగా మొదటి కుమార్తె నాలుగేళ్ల క్రితం అనారోగంతో మృతి చెందింది. మూడో సంతానం శివకార్తికేయ పాముకాటుకు బలికావడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
ధర్నా విజయవంతం చేద్దాం
కోస్గి: తెలంగాణ ప్రభుత్వం జేఏసీకి ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా తాత్సారం చేస్తోందని టీజీఈజేఏసీ మండల అధ్యక్షుడు మల్లికార్జున్ అన్నారు. శనివారం పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో టీజీఈజేఏసీ భాగస్వామ్య సంఘాల ఉద్యమ సన్నాహక సమావేశంలో ఆ యన మాట్లాడారు. డీఏల బకాయిలు చెల్లించడమేగాక పాతపింఛన్ విధానం అమలు చేయాలన్నారు. హెల్త్‌కార్డుల వ్యవహారంలో ప్రభు త్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ప్రతి పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేలా చర్య లు చేపట్టాలని, పంతానికి పోకుండా సమస్య లు పరిష్కరించాలని కోరారు. 27న జిల్లాకేంద్రంలోని వివేకానందపార్క్ వద్ద చేపట్టే ధర్నా ను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా జేఏసీ నేతలు భీమయ్య, రెడ్డప్ప, యశ్వంత్, రాజేందర్‌రావు పాల్గొన్నారు.
అలసందలు @ రూ.6,818
నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో శనివారం ఆలసందలు క్వింటా గరిష్టంగా రూ.6,818, కనిష్టంగా రూ.3,600 ధర పలికాయి. అదేవిధంగా పెసర గరిష్టంగా రూ.9,062, కనిష్టంగా రూ.5,509 ధర లభించింది.


