పాపన్న గౌడ్‌ పోరాటం స్ఫూర్తిదాయకం | - | Sakshi
Sakshi News home page

పాపన్న గౌడ్‌ పోరాటం స్ఫూర్తిదాయకం

Aug 19 2026 12:42 AM | Updated on Aug 19 2026 12:42 AM

నారాయణపేట: సర్ధార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ సామాజిక న్యాయం, సమానత్వం కోసం చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ శ్రీను అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పాపన్నగౌడ్‌ జయంతికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి పాపన్నగౌడ్‌ చూపిన మార్గం నేటి తరానికి ఆదర్శమన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు, గౌరవం కల్పించే దిశగా ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌డీసీ రాజేందర్‌గౌడ్‌, జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి అబ్దుల్‌ ఖలీల్‌, సూపరింటెండెంట్‌ అఖిల ప్రసన్న, గౌడ సంఘం నాయకులు సతీష్‌గౌడ్‌, రఘురామయ్య, గురునాథ్‌గౌడ్‌, కలాల్‌ ఆనంద్‌గౌడ్‌, సర్పంచ్‌ శేఖర్‌గౌడ్‌, కలెక్టరేట్‌ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement