రేపు, మాపు అంటున్నారు.. | - | Sakshi
Sakshi News home page

రేపు, మాపు అంటున్నారు..

Aug 18 2026 7:52 AM | Updated on Aug 18 2026 7:52 AM

రేపు, మాపు అంటున్నారు.. 5 నెలలుగా ఎదురుచూస్తున్నాం.. త్వరలోనే జమవుతాయి..

అప్పు చేసి ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తిచేశా. 2 నెలల క్రితం గృహప్రవేశం చేశాం. ఇప్పటి వరకు రూ. 3.40లక్షల బిల్లులు మాత్రమే వచ్చాయి. చివరి బిల్లు రూ. 1.60లక్షలు రావాలి. ఈ బిల్లు కోసం రెండు నెలల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. రేపు, మాపు అంటున్నారే తప్ప.. బిల్లు మాత్రం రావడం లేదు.

– మడ్డి ఎల్లమ్మ, మరికల్‌

ఇందిరమ్మ ఇంటి నిర్మా ణం పూర్తిచేసి 5 నెలల క్రి తం గృహప్రవేశం చేశాను. ఇప్పటి వరకు మూడు బిల్లులు మాత్రమే వచ్చా యి. చివరి బిల్లు రూ. 1.60లక్షల కోసం ఎదురుచూస్తున్నాం. పెండింగ్‌ బిల్లు అందిస్తే ఇంటి నిర్మాణానికి చేసిన అప్పులను తీర్చేందుకు ఉపయోగపడుతుంది.

– రాములు, మరికల్‌

ఇందిరమ్మ ఇళ్ల చివరి బిల్లు సమస్య రాష్ట్రవ్యాప్తంగా ఉంది. ఇంటి నిర్మాణాలు పూర్తిచేసుకున్న లబ్ధిదారులకు రూ. 3.40లక్షలు మంజూరు చేయడం జరిగింది. ఉపాధి హామీ, స్వచ్ఛభారత్‌ మిషన్‌, ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్‌ యోజన కింద మంజూరయ్యే బిల్లుతో కలిపి మొత్తం బిల్లు వస్తుంది. ఈ విషయంలో లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా బిల్లులు వస్తాయి.

– హరికృష్ణ, డీఈఈ, నారాయణపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement