● ఒక్కో ఇంటికి రూ. 3.40లక్షలు మాత్రమే విడుదల
● చివరి విడత రూ. 1.60లక్షల బిల్లు కోసం నెలల తరబడి నిరీక్షణ
● జిల్లాలో 1,878 ఇళ్ల నిర్మాణాలు పూర్తి
మరికల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అధికారులు, ప్రజాప్రతినిధుల ప్రోత్సాహంతో వేగంగా కొనసాగుతున్నా యి. నిర్మాణ ముడిసరుకు ధరలు పెరిగినా.. ప్రభు త్వం అందిస్తున్న ఆర్థికసాయం సరిపోకపోయినా లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేస్తున్నారు. అయితే దశల వారీగా మంజూరు చేస్తున్న నాలుగు విడతల బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతుండటం లబ్ధిదారులను ఆందోళనకు గురిచేస్తోంది. మొ దటి మూడు బిల్లులు సకాలంలో వస్తున్నా.. చివరి బిల్లు కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సి వ స్తోందని వాపోతున్నారు. పట్టణాల్లో కంటే గ్రామా ల్లో ఈ సమస్య అధికంగా ఉండటం గమనార్హం.
అప్పులు చేసి నిర్మాణాలు..
ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం అందించే రూ. 5లక్షలు ఏమాత్రం సరిపోవడం లేదు. లబ్ధిదారులు అప్పులు చేసి మరీ నిర్మాణ పనులను చేపడుతున్నారు. ఎంతో కష్టపడి ఇంటి నిర్మాణం పూర్తిచేసి, గృహప్రవేశాలు జరిగి నెలలు కావొస్తున్నా చివరి బిల్లు మాత్రం అందడం లేదు. పునాది స్థాయిలో రూ.లక్ష, గోడల నిర్మాణం పూర్తయ్యాక మరో రూ.లక్ష, స్లాబ్ నిర్మాణం చేపట్టాక రూ. 1.40లక్షలు మంజూరు చేశారు. మిగతా రూ.1.60 లక్షల బిల్లును ఇతర పథకాలకు అనుసంధానం చేశారు. ఇందులో వీబీ–జీ రామ్‌జీ (ఉపాధి హామీ) ద్వారా రూ. 27వేలు, స్వచ్ఛభారత్ మిషన్ కింద మరుగుదొడ్డి నిర్మాణానికి రూ. 12వేలు, ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కింద రూ. 21వేలు చెల్లించాల్సి ఉంది. ఈ బిల్లులు సైతం నెలల తరబడి ఆలస్యమవుతోంది. ఆవాస్ యోజన కింద రూ. 21 వేలు అసలే రావడం లేదని బాధితులు వాపోతున్నారు. పట్టణంలో మాత్రం ఉపాధి హామీ లేకపోవడంతో మూడో బిల్లు రూ. 2లక్షలు జమ చేస్తున్నారు.
నిరుపేదల ఆందోళన..
ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల జాప్యంతో చాలామంది ల బ్ధిదారులు ఇళ్లు నిర్మించుకునేందుకు వెనుకంజ వే స్తున్నారు.అసలే పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న కుటుంబాలు కావడంతో బిల్లు రాకుంటే అప్పులు భారమవుతాయని ఆందోళన చెందుతున్నారు.ఇ లా ఇంటి నిర్మాణాలు ప్రారంభించని వారు జిల్లా లో అ ధికంగానే ఉన్నారు. తొలుత వారి ఇళ్లను రద్దు చేయా లని అధికారులు జాబితా సేకరించినా ఆలస్యమైనా కట్టుకునేందుకు వెసులుబాటు కల్పించారు.
మరికల్‌లో నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు


