మక్తల్: మరాఠాయోధుడు ఛత్రపతి శివాజీ ఆశయ సాధనకు యువత కృషి చేయాలని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ పిలుపునిచ్చారు. సోమ వారం మక్తల్ మండలం మంతన్‌గోడ్‌లో నూతనంగా ఏర్పాటుచేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. అంతకు ముందు గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఛత్ర పతి శివాజీ విగ్రహ దాత ఉప్పరి అశోక్‌కుమార్ ఎంపీ డీకే అరుణ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం దత్తాత్రేయ ఆల యం వద్ద ఎంపీ నిధులు రూ. 10లక్షలతో కమ్యూనిటీహాల్ నిర్మాణాన్ని ప్రా రంభించారు. గ్రామాభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రా మ్మోహన్‌రెడ్డి, రతంగ్‌పాండురెడ్డి, నర్సింహాగౌడ్, పడకుల శ్రీనివాస్, వెంకట్రాములు, బాల్‌రాంరెడ్డి, ప్రతాప్‌రెడ్డి, శ్రీనివాస్‌గుప్తా, కర్నిస్వామి పాల్గొన్నారు.


