ఒత్తిళ్లతోనే బిల్లులు మంజూరు.. | - | Sakshi
Sakshi News home page

ఒత్తిళ్లతోనే బిల్లులు మంజూరు..

Aug 14 2026 7:56 AM | Updated on Aug 14 2026 7:56 AM

ఒత్తిళ్లతోనే బిల్లులు మంజూరు.. కొలతలు మాత్రమే పర్యవేక్షిస్తాం బాధ్యులపై చర్యలు తీసుకుంటాం..

కాకి చెన్నమ్మకు మొదటివిడతలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో ముగ్గు వేసి ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించిన మాట వాస్తవమే. కాని ఆ మహిళకు, నిర్మాణం చేస్తున్న స్థలానికి ఎలాంటి సంబంధం లేదని తెలియడంతో అధికారుల ఆదేశాల మేరకు బిల్లులు నిలిపి వేశాం. తర్వాత స్థానిక పుర అధికారితో పాటు పురపాలికకు చెందిన ఓ ప్రజాప్రతినిధి ఒత్తిడి చేయడంతో తప్పనిసరి పరిస్థితిలో బెస్‌మెంట్‌ బిల్లు, రూఫ్‌ లెవల్‌ బిల్లు మంజూరు చేయాల్సి వచ్చింది. మంజూరైన బిల్లులు సైతం కాకి చెన్నమ్మ బ్యాంకు ఖాతాలో జమయ్యాయి. చెత్తు లెవల్‌ బిల్లు సైతం మంజూరైంది కాని బ్యాంకులో జమ కాలేదు.

– అర్బాజ్‌, వార్డు అధికారి, కోస్గి

ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కేవలం ప్రభుత్వం నిర్దేశించిన కొలతల మేరకు పనులు జరుగుతున్నాయా లేదా అనే విషయం పర్యవేక్షించడం మాత్రమే నా బాధ్యత. ఇళ్లు మంజూరు చేయడం, ముగ్గు వేయడం, నిర్మాణాలకు ఎంపిక చేసిన స్థలాల పరిశీలన అంశాలు పూర్తిగా పుర అధికారులదే. వార్డు అధికారి క్షేత్రస్థాయిలో పరిశీలించి బిల్లు మంజూరు కోసం ఏఈ లాగిన్‌కు పంపిస్తారు. నిర్మాణ కొలతలు పరిశీలించి అన్ని సక్రమంగా ఉంటే ఓకే చేయడం మాత్రమే నా బాధ్యత.

– శివకుమార్‌, హౌజింగ్‌ ఏఈ, కోస్గి

ఇందిరమ్మ ఇళ్ల బిల్లులను మొదట వార్డు అధికారి పరిశీలించి హౌజింగ్‌ అధికారుల లాగిన్‌కు పంపిస్తారు. వార్డు అధికారి, హౌజింగ్‌ ఏఈ నిర్ధారించిన బిల్లులను మాత్రమే అప్రూవల్‌ చేస్తా. బిల్లుల మంజూరు విషయంలో పూర్తి బాధ్యత క్షేత్రస్థాయిలో పరిశీలించే వార్డు అధికారి, హౌజింగ్‌ ఏఈదే. అనర్హులకు బిల్లు మంజూరు చేసిన విషయంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.

– నాగరాజు, పుర కమిషనర్‌, కోస్గి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement