విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి చర్యలు | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి చర్యలు

Aug 14 2026 7:56 AM | Updated on Aug 14 2026 7:56 AM

మక్తల్‌: గ్రామాల్లో విద్యుత్‌ సమస్యలు తలెత్తకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటామని ఎస్‌ఈ నవీన్‌కుమార్‌ తెలిపారు. గురువారం నియోజకవర్గంలోని కృష్ణా, మాగనూర్‌, మక్తల్‌, నర్వ, ఊట్కూర్‌ మండలాల్లో సంబంధిత అధికారులతో కలిసి పర్యటించారు. అనంతరం మక్తల్‌ సబ్‌స్టేషన్‌ దగ్గర ప్రత్యేకంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి గ్రామంలో విద్యుత్‌ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాల సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని సందర్శించి ఏమైనా ఇబ్బందులుంటే పరిశీలించి నమోదు చేసుకుంటున్నట్లు చెప్పారు. మంత్రి ప్రత్యేక చొరవతో నిధులు మంజూరు చేయించి సమస్యలను పరిష్కరిస్తారన్నారు. త్వరలో ఆత్మకూర్‌, అమరచింత మండలాల్లోని అన్ని గ్రామాల్లో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యుత్‌ లైన్‌మెన్ల పరిధిలో లేని సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చినట్లు చెప్పారు. రెండు, మూడు గ్రామాలకు ఒక అధికారిని నియమించి క్షేత్రస్థాయిల్లో పరిశీలిస్తామని చెప్పారు. ఆయన వెంట ఏడీఈ విజయకుమార్‌, ప్రదీప్‌కుమార్‌, గంగాధర్‌, సుధారాణి, డీఈలు నర్సింగ్‌రావు, రాజునాయక్‌, ఏఈలు వెంకటేష్‌గౌడ్‌, మహేష్‌గౌడ్‌, సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement