రాజీవ్‌గాంధీ జ్యోతి సద్భావన యాత్రకు ఘన స్వాగతం | - | Sakshi
Sakshi News home page

రాజీవ్‌గాంధీ జ్యోతి సద్భావన యాత్రకు ఘన స్వాగతం

Aug 13 2026 1:03 AM | Updated on Aug 13 2026 1:03 AM

నారాయణపేట/మక్తల్‌: రాజీవ్‌గాంధీ జ్యోతి సద్భావన యాత్రకు బుధవారం జిల్లాలో కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. తమిళనాడు నుంచి ప్రారంభమైన యాత్ర వివిధ రాష్ట్రాల మీదుగా కర్ణాటకకు చేరుకొని అక్కడి నుంచి తెలంగాణలోకి ప్రవేశించింది. ఉదయం 10 గంటలకు మక్తల్‌ మండలంలోని కృష్ణా వంతెన వద్ద సద్భావన జ్యోతిని రాయచూర్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు, సద్భావన యాత్ర కర్ణాటక కన్వీనర్‌ ఆర్‌.దోరైవేలు స్వామి చేతుల మీదుగా డీసీసీ అధ్యక్షుడు కె.ప్రశాంత్‌కుమార్‌రెడ్డి స్వీకరించారు. అక్కడ ప్రారంభమైన యాత్ర 12 గంటలకు మక్తల్‌కు, మధ్యాహ్నం ఒంటిగంటకు నారాయణపేట సింగారం గేట్‌కు చేరుకుంది. అక్కడి నుంచి జిల్లాకేంద్రంలోని ప్రధాన వీధుల మీదుగా జలాల్‌పూర్‌ వరకు కొనసాగింది. అనంతరం సద్భావన జ్యోతిని కర్ణాటక రాష్ట్రంలోని యాదగిరి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడికి అందజేశారు. రాజీవ్‌గాంధీ ఆశయమైన జాతీయ సమైక్యత, సోదరభావం, శాంతి, సద్భావన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే యాత్ర ఉద్దేశమని కాంగ్రెస్‌ నాయకులు తెలిపారు. మక్తల్‌లో జరిగిన కార్యక్రమంలో పుర చైర్‌పర్సన్‌ వాకిటి మానస హన్మంతు, మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ గణేష్‌కుమార్‌, మాజీ ఉపసర్పంచ్‌ కట్టా సురేష్‌, కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌, యువజన అధ్యక్షుడు భాస్కర్‌, పట్టణ అధ్యక్షుడు రవికుమార్‌, నారాయణపేటలో జరిగిన కార్యక్రమంలో కమిటీ సభ్యులు జగదీష్‌, సుజేంద్రశెట్టి, మార్కెట్‌ చైర్మన్‌ ఆర్‌,శివారెడ్డి, కాంగ్రెస్‌పార్టీ నాయకులు మనోహర్‌గౌడ్‌, కోట్ల రవీందర్‌రెడ్డి, కోట్ల మధుసూదన్‌రెడ్డి, వెంకటేష్‌గౌడ్‌, కొంకల్‌ శ్రీనివాస్‌రెడ్డి, పేరపళ్ల శంకర్‌, వకీల్‌ సంతోష్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement