దామరగిద్ద: ప్రత్యేక శిక్షణలో నేర్చుకున్న అంశాలను తరగతి గదుల్లో సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా విద్యాధికారి గోవిందరాజు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎమ్మార్సీలో కొనసాగుతున్న ఉపాధ్యాయుల రెండోవిడత ఇండిగ్రేడెట్ శిక్షణను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చదవడం, రాయడం, ప్రాథమిక గణిత నైపుణ్యాల అభివృద్ధి, విద్యార్థి కేంద్రీకృత అభ్యాసనం వంటి అంశాలను తరగతి గదిలో విధిగా అమలు చేయాలన్నారు. ప్రతి విద్యార్థి అభ్యాసన సామర్థ్యాన్ని గుర్తించి స్థాయికి తగిన బోధన అందించాలని సూచించారు. ఆయన వెంట జీహెచ్‌ఎం సురేష్, ఆర్పీలు జానకిరాములు, బాలమురళి, ప్రీతి, ఉపాధ్యాయులు ఉన్నారు.
ఆరుతడి పంటలతో
అధిక లాభాలు
నారాయణపేట: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు వానాకాలంలో వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేసుకుని అధిక లాభాలు పొందాలని జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్ సూచించారు. శుక్రవారం మండలంలోని శాసనపల్లిలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక జిల్లాలోని కుంటలు, చెరువుల్లో నీటి లభ్యత తక్కువగా ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నీటి అవసరం అధికంగా ఉండే వరికి బదులు పత్తి, కంది, పెసర, మినుములు, జొన్న తదితర ఆరుతడి పంటలను సాగు చేయాలన్నారు. తక్కువ నీటితో సాగయ్యే పంటలను ఎంచుకోవడం ద్వారా పెట్టుబడులు తగ్గించుకుని మెరుగైన ఆదాయం పొందవచ్చని సూచించారు. అనంతరం గ్రామంలో సాగు చేస్తున్న విత్తన పత్తి పంటను ఆయన పరిశీలించారు. విత్తనోత్పత్తిలో పాటించాల్సిన మెళకువలు, సస్యరక్షణ చర్యలపై సూచనలు చేశారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి బాల దినకర్, వ్యవసాయ విస్తరణ అధికారి ప్రకాశ్, రైతులు చిన్న నర్సింహులు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
పక్కా కొలతలతో యూనిఫాం
● ప్రతి విద్యార్థి నుంచి కుట్టు కొలతలు
● మహిళ టైలర్లకు ప్రత్యేక శిక్షణ
● సైజు సరిపోదనే సమస్యకు స్వస్తి


