ఎగబడి పోవాలె..!
‘ఆటో’.. ఇటో
నారాయణపేట జిల్లా కోస్గి మండలంలోని చెన్నారం, బిజ్జారం గ్రామాల విద్యార్థులకు ఈ ప్రమాదకర ఫీట్లు నిత్యకృత్యంగా మారాయి. ఆయా గ్రామాల విద్యార్థులు సుమారు 60 మంది మున్సిపాలిటీ కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. ఆ పల్లెలకు బస్సు సౌకర్యం ఉన్నా.. పాఠశాలల సమయానికి రాకపోవడంతో వారికి తిప్పలు తప్పడం లేదు.
నాగర్‌కర్నూల్: 85 గ్రామాలు..
జిల్లాలో మొత్తం 360 గ్రామాలు ఉన్నాయి. జిల్లాలో నాలుగు డిపోలు ఉండగా.. 275 గ్రామాలకు సర్వీసులు నడుస్తుండగా.. మరో 85 పల్లెలకు బస్సు సౌకర్యం లేదు. సుదూర ప్రాంతాల్లోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో ప్రధానంగా 50 గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బస్సు సౌకర్యం కల్పించాలని ఈ విద్యాసంవత్సరంలో ఆర్టీసీకి 16 దరఖాస్తులు రాగా.. 12 గ్రామాలకు పునరుద్ధరించారు.
ఇబ్బంది పడుతున్న గ్రామాలు..: మర్రిపల్లి (ఉప్పునుంతల), జమిస్తాపూర్ (నాగర్‌కర్నూల్), చెన్నంపల్లి, పద్మనపల్లి, కొత్త చెరువు, ఎంసీతండా (లింగాల), మైలారం, లక్ష్మీపల్లి, బాణాల, అంబగిరి, నర్సాయిపల్లి (బల్మూరు), ఖానాపూర్, గుడ్ల నర్వ, నెల్లికొండ (బిజినేపల్లి).
జిల్లాలో 423 గ్రామాలు ఉన్నాయి. జిల్లాలో ఒక ఆర్టీసీ డిపో ఉండగా.. దీని పరిధి 45 రూట్లలో బస్సులు నడుస్తున్నాయి. నాలుగు గ్రామాలకు బస్సు సర్వీసులు లేకపోవడంతో ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. టంకర మినహాయించి మూడు గ్రామాలకు చెందిన వారు బస్సులు నడపాలని విజ్ఞప్తులు చేసినా.. అమలు కాలేదు.
ఇబ్బంది పడుతున్న గ్రామాలు..: టంకర, కిష్టారం (హన్వాడ), కొత్తపల్లి (మిడ్జిల్), రామచంద్రపూర్ (మహబూబ్‌నగర్ రూరల్)
ఫీట్లు.. పాట్లు
నో బస్.. నో సర్వీస్
మహబూబ్‌నగర్: 4 పల్లెలకు..
ఉమ్మడి జిల్లాలో బస్సు సౌకర్యం లేక విద్యార్థుల అగచాట్లు
అనేక గ్రామాల్లో కిక్కిరిసిన ఆటోల్లోనే పాఠశాలలకు..
కొన్నిప్రాంతాల్లో ఎడ్ల బండ్లు, కాలినడకే శరణ్యం
నిత్యం కిలోమీటర్ల కొద్దీ ప్రమాదకర ప్రయాణం
అరకొరగా ఆర్టీసీ సర్వీస్‌లు.. సమయానికి రాక.. వచ్చినా ఆపక ఇబ్బందులు
పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
ఎగబడి పోవాలె..!


