వినియోగదారుడి విజయం | - | Sakshi
Sakshi News home page

వినియోగదారుడి విజయం

Mar 15 2026 6:16 AM | Updated on Mar 15 2026 6:16 AM

బాలానగర్‌కు చెందిన ముసాని విజయానంద్‌ గత ఏడాది అక్టోబర్‌ మొదటి వారంలో దీపావళి ఆఫర్‌ కింద మహబూబ్‌నగర్‌–ఏనుగొండలోని ఏథర్‌ షోరూంలో ఎలక్ట్రిక్‌ బైక్‌ను బుక్‌ చేశారు. ఇందులో భాగంగా ఆన్‌లైన్‌లో అమెజాన్‌ ద్వారా రూ.1.04 లక్షలు చెల్లించారు. అయితే తమ వద్ద వాహనం లేదంటూ ఈ డబ్బులను రీఫండ్‌ చేశారు. దీంతో బాధితుడు వినియోగదారుల ఫోరం కమిషన్‌లో కేసు వేశారు. దీంతో షోరూం నిర్వాహకులు దిగి వచ్చి ఆఫర్‌లో తిరిగి డబ్బులు తీసుకుని వాహనాన్ని డెలివరీ చేయడంతో బాధితుడు సంతోషం వ్యక్తం చేశారు.

తూకాల్లో మోసాలు

తూనికల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టకపోవడంతో వ్యాపారస్తులు తూకాల్లో తేడా చేస్తూ పేదలను మోసం చేస్తున్నారు. మరోపక్క వారాంతపు సంస్థలో బాట్లకు బదులు మోటు రాళ్లు పెట్టి తూకం చేసి వ్యాపారులు సామాన్యులతో భారీగా డబ్బులు గుంజుతున్నారు. అలాగే రైతులు పండించిన పంటలను దలారి వ్యాపారులు ఎలక్ట్రిక్‌ కాంటాల్లో మోసాలకు పాల్పడుతూన్నారు. తూనికల శాఖ అధికారులు మాత్రం కన్నెత్తి చూడడం లేదు. –మోహన్‌రెడ్డి, రైతు,

మరికల్‌, నారాయణపేట జిల్లా

ఫిర్యాదులు పెరుగుతున్నాయి..

వినియోగదారులు ఎవరైనా వస్తువులు కొనుగోలు చేసిన ప్రతి సందర్భంలో కూడా తప్పక బిల్లు తీసుకోవాలి. వస్తువు నాణ్యతలో లోపం ఉన్నా, ఇతర సమస్య ఏది ఉన్నా.. కోర్టుకు వెళ్లడానికి అవకాశం ఉంటుంది. కొనుగోలు చేసిన బిల్లు లేకపోతే చట్టపరంగా ఎదుర్కొవడానికి రాదు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఒకే ఒక్క కోర్టు ఉండటం వల్ల ఫిర్యాదులు పెరుగుతున్నాయి. జిల్లాలో ప్రతి రోజు హక్కుల ఫోరంకు రెండు నుంచి మూడు వరకు కేసులు వస్తుంటాయి. ఎక్కువగా ఎలక్ట్రానిక్‌ వస్తువులు, జీవిత భీమా, చిట్‌ఫండ్‌, ఫైనాన్స్‌లలో నష్టపోయిన వాళ్లు అధికంగా వస్తుంటారు. ముఖ్యంగా గ్రామీణా ప్రాంతాల నుంచి ఎవరు రావడం లేదు.. పట్టణ ప్రాంతాల నుంచి అవగహన ఉన్న వ్యక్తులు మాత్రమే కేసులు వేయడానికి వస్తున్నారు. ఇంకా ప్రజల్లో దీనిపై చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. వచ్చిన కేసులు పెండింగ్‌లో లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కారించడానికి కృషి చేస్తున్నాం.

– అశోక్‌ వర్ధన్‌రాజు, వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ సూపరిటెండెంట్‌

Advertisement
 
Advertisement
Advertisement