కన్నడతో ప్రయోజనం లేదు..
కన్నడ మీడియం చదవడంతో విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనం లేదు. తెలంగాణలో ఉంటూ తెలుగు మీడియానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. తెలుగు మాధ్యమాన్ని ప్రోత్సహించాలి.
– నాగప్ప, సర్పంచ్, కృష్ణా
రెండో భాషగా తీసుకోవాలి..
ఒకేసారి కన్నడ మీడియం పాఠశాలలను రద్దు చేయడం కుదరదు. మొదట తల్లిదండ్రులు తమ పిల్లలను తెలుగు మీడియంలో చేర్పించాలి. అలాగే కన్నడను రెండోభాషగా తీసుకుంటే ఆ ప్రాంతంలో ఉద్యోగాలు సాధించేందుకు అవకాశం ఉంటుంది.
– జనార్దన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు, పీఆర్టీయూ
రెండు భాషలు రెండు కళ్లు..
కన్నడ, తెలుగు నాకు రెండు కళ్లలాంటివి. నేను రెండు భాషల విద్యార్థులకు న్యాయం చేస్తా. నేను మొదట కన్నడ మీడియంలోనే చదివి ఉపాధ్యాయుడినయ్యా. పుట్టకముందు నుంచే ఇక్కడ కన్నడ మీడియం పాఠశాలలు ఉన్నాయి. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు సమయంలోనే ఇక్కడి ప్రజల మాతృభాష కన్నడం కావడంతో అప్పట్లో కన్నడ పాఠశాలలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ ప్రాంత విద్యార్థులకు ఏ ఇబ్బంది వచ్చినా అన్నిరకాలుగా అండగా ఉండి సహాయ సహాకారాలు అందిస్తా.
– నిజాముద్దీన్, ఎంఈఓ, కృష్ణా
పాఠశాలల అస్థిత్వం కాపాడాలి..
మండలంలో కన్నడ, తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు ఉన్నాయి. పేద ప్రజలకు ఏది ఉపయోగమో వాటినే కొనసాగించాలి. సమాజంలో డబ్బు ఉన్న వారు వారి పిల్లలను ప్రవేటు పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలొ చదివిస్తున్నారు. కేవలం పేద ప్రజల పిల్లలు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్నారు. వారికి ఉపయోగపడే విధ్యను అందించడం మన కర్తవ్యం.ప్రబుత్వ పాఠశాలలను కాపాడుకోవడంతో పాటూ అస్థిత్వంను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.ప్రస్తుతం పోటీ ప్రపంచంలో ప్రభుత్వ పాఠశాలలు చాల సమస్యలను ఏదుర్కోంటుంది.
– శేఖర్, ఉపాధ్యాయుడు, ముడుమాల్
ఇరు రాష్ట్రాలు ఆలోచించాలి..
కన్నడ మీడియం విద్యార్థుల భవిష్యత్‌ను అటు కర్ణాటక, ఇటు తెలంగాణ ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కేవలం 10వ తరగతి వరకే కన్నడ మీడియం పాఠశాలలు ఉండటంతో ఉన్నత చదువులకు కర్ణాటకకు వెళ్లాల్సి వస్తోంది. ఈ సమయంలో అక్కడి ప్రభుత్వం తెలంగాణ విద్యార్థులపై సవతి తల్లి ప్రేమ చూపడం తగదు. అందుకే మన ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వంతో చర్చించి తగిన న్యాయం చేయాలి.
– కృష్ణా, జిల్లా ఉపాధ్యక్షుడు, కేఎన్‌పీఎస్, గుడెబల్లూర్
కన్నడతో ప్రయోజనం లేదు..
కన్నడతో ప్రయోజనం లేదు..
కన్నడతో ప్రయోజనం లేదు..
కన్నడతో ప్రయోజనం లేదు..


