మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ జెండా ఎగరాలి | - | Sakshi
Sakshi News home page

మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ జెండా ఎగరాలి

Jan 21 2026 6:46 AM | Updated on Jan 21 2026 6:46 AM

మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ జెండా ఎగరాలి

మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ జెండా ఎగరాలి

పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగాకార్యకర్తలు పనిచేయాలి

రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి

మక్తల్‌: మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ జెండా ఎగరవేసేందుకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. మంగళవారం మక్తల్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్‌పార్టీ ముఖ్య నా యకులతో ఆయన సమావేశమై మాట్లాడారు. ము న్సిపల్‌ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ.. సమస్య ల పరిష్కారానికి ముందుండి పనిచేసే వారికే టికె ట్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. మక్తల్‌ మున్నిపాలిటీలోని 16 వార్డుల్లో పార్టీ టికెట్‌ ఆశించే అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక అర్హులందరికీ రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తోందన్నారు. మున్సిపాలిటీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టిందన్నారు. మక్తల్‌ పట్టణంలో ఇప్పటికే కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నా రు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నాయకులకు మంత్రి సూచించారు. సమావేశంలో మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీటీసీ కోళ్ల వెంకటేశ్‌, మార్కెట్‌ కమి టీ వైస్‌చైర్మన్‌ గణేశ్‌కుమార్‌, కట్టా సురేశ్‌, రవికుమార్‌, రాజేందర్‌, వెంకటేశ్‌, నాగరాజు, శ్యామ్‌, గోవర్ధన్‌, ఎండీ సలాం, ఫయాజ్‌, రంజిత్‌కుమార్‌రెడ్డి, బీకేఆర్‌ చైర్మన్‌ బాలకిష్ణారెడ్డి ఉన్నారు.

అన్ని రంగాల్లో అభివృద్ధి..

మక్తల్‌ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. పట్టణంలోని 5వ వార్డులో రూ. 40లక్షలతో నిర్మించతలపెట్టిన సీసీరోడ్డు పనులకు ఆయన భూమిపూజ చేశారు. అనంతరం మైనార్టీ కాలనీలో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. కాలనీలో రోడ్డు సక్రమంగా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు మంత్రి దృష్టికి తీసుకురాగా.. ఆయన వెంటనే స్పందించి రోడ్డుకు మరమ్మతు చేయించారు. అదే విధంగా రూ. 43కోట్లతో నిర్మిస్తున్న 150 పడకల ఆస్పత్రి భవన నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల్లో నాణ్యత పాటిస్తూ త్వరగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు మంత్రి సూచించారు. రూ. 3.70కోట్లతో చేపట్టిన మినీ ట్యాంక్‌బండ్‌ నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement