హోరాహోరీగా రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు
నారాయణపేట రూరల్: జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి 35వ సబ్ జూనియర్ ఖోఖో పోటీలు సోమవారం హోరాహోరీగా కొనసాగాయి. టోర్నీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ నర్సింహులు రెండో రోజు పోటీలను ప్రారంభించి మాట్లాడారు. క్రీడల్లో రాణించే వారికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. క్రీడల్లో గెలుపోటములను ప్రతి క్రీడాకారుడు సమానంగా స్వీకరించాలని సూ చించారు. కాగా, రాత్రి ఫ్లడ్ లైట్ల వెలుతురులో టో ర్నీ కొనసాగింది. బాలబాలికలకు వేర్వేరుగా జరిగిన పోటీల్లో ప్రతిభకనబరిచిన జట్లను అభినందించారు. డీవైఎస్‌ఓ వెంకటేశ్ శెట్టి, ఎస్‌జీఎఫ్ సెక్రెటరీ శ్రీనివాసరెడ్డి, పీడీలు రత్నయ్య, బాలరాజు, సాయినాథ్, నర్సింహారెడ్డి, రవికుమార్, వెంకటేశ్, రాజశేఖర్, మౌలాలి, వేణుగోపాల్, ఫర్విన్, తిరుమలేష్, గణేశ్, చక్రవర్తి హారికాదేవి పాల్గొన్నారు.


