క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్
నారాయణపేట రూరల్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయకుమార్, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలో 35వ సబ్ జూనియర్ ఖో–ఖో పోటీలను వారు ప్రారంభించి మాట్లాడారు. క్రీడలతో స్నేహభావంతో పాటు మానసికోల్లాసం, దేహ దారుఢ్యం పెంపొందుతాయని తెలిపారు. పోటీల్లో గెలుపోటములు సహజమని.. ఓటమిని స్ఫూర్తిగా తీసుకుంటే గెలుపు వరిస్తుందని చెప్పారు. జిల్లామంత్రి చొరవ చూపితే రెండేళ్లలో అద్భుతమైన స్టేడియాన్ని నిర్మిస్తారని తెలిపారు. ఈ ఏడాది రెండు రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు నిర్వహించడం గర్వించదగ్గ విషయమన్నారు. రాబోయే రోజుల్లో క్రీడల్లో జిల్లాను మొదటి స్థానంలో నిలిపేందుకు ప్రయత్నించాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ సదాశివారెడ్డి, ఖో–ఖో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కృష్ణమూర్తి, ఉమ్మడి జిల్లా కార్యదర్శి మిలియన్, లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ హరినారాయణ భట్టడ్, డీవైఎస్‌ఓ వెంకటేష్ శెట్టి తదితరులు పాల్గొన్నారు.
పురందరదాసుల
ఆరాధనోత్సవాలు
నారాయణపేట: పట్టణంలోని రాఘవేంద్రస్వామి ఆలయంలో ఆదివారం పురుందరదాసుల ఆరాధనోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిమజ్జనం ఎరగని వినాయకుడు, అనంతసేన ఆలయం, ఆంజనేయస్వామి ఆలయాల్లో పూజలు చేశారు. అనంతరం హరిదాసుల సంకీర్తనలతో పురవీధుల్లో గోపాల కార్యక్రమం నిర్వహించారు. రాఘవేంద్రస్వామి ఆలయంలో పల్లకీసేవ, సర్వసేవ కార్యక్రమాలు జరిగాయి. ప్రముఖ జ్యోతిష్య పండితుడు విద్వాన్ అనిల్ దేశాయి పురందరదాసుల జీవిత చరిత్రను భక్తులకు వివరించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకుడు నర్సింహచారి, సేవాసమితి సభ్యులు రఘుప్రేమ్ జ్యోషి, నర్సింహ, మంజునాథ జ్యోషి, నారాయణరావు, సీతారామారావు, శ్రీహరి, ప్రహ్లాద, నరహరి, రాఘవేంద్ర, శేషు, భరత్, ప్రభంజన్‌రావు, దరణీధర్, ధీరజ్ దీక్షిత్, గురురాజ్, అనిరుధ్, ప్రదీప్, రవితేజ, రామ్మోహన్‌రావు, రాఘవేందర్‌రావు, మహిళా భజన మండలి సభ్యులు పాల్గొన్నారు.
క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్


