కంప్యూటర్ హబ్ పనుల్లో వేగం పెంచాలి
కోస్గి రూరల్: అటల్ టింకరింగ్ కంప్యూటర్ హబ్ ఏర్పాటుకుగాను పైలెట్ ప్రాజెక్టుగా జిల్లాలోని కోస్గి బాలికల ఉన్నత పాఠశాల ఎంపికై ంది. శనివారం నిర్మాణ పనులను జిల్లా విద్యాధికారి గోవిందరాజులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్మాణ పనులకు ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.14 లక్షలు మంజూరు చేసిందని తెలిపారు. వీటితో 8 లాప్‌టాప్‌లు, పెద్ద టీవీతో పాటు ఇతర సామగ్రి కొనుగోలు చేయనున్నామని చెప్పారు. చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఉపాధ్యాయులకు సాఫ్ట్‌వేర్ సమస్యలు, ఏఐ ఆధారిత విద్యపై శిక్షణ సైతం ఇక్కడే ఇవ్వనున్నట్లు వివరించారు. అనంతరం బీసీకాలనీలో రూ.5 కోట్లతో చేపడుతున్నట్లు సైన్స్ మ్యూజియం నిర్మాణ పనులను పరిశీలించారు. ఆయన వెంట మండల విద్యాధికారి శంకర్‌నాయక్, యాదయ్యశెట్టి తదితరులు ఉన్నారు.


