నేడు కోర్టు ప్రారంభం
మక్తల్: పట్టణంలో ఏర్పాటు చేసిన జూనియర్ మున్సిఫ్ కోర్టును శనివారం హైకోర్టు న్యాయవాదులు అనిల్‌కుమార్ జూకంటి, మాధవీదేవిప్రారంభించనున్నట్లు మక్తల్ న్యాయవాదుల కమిటీ శుక్రవారం తెలిపింది. కార్యక్రమానికి న్యాయవాదులు, పట్టణవాసులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
104 ఉద్యోగుల పెన్‌డౌన్
నారాయణపేట: బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలంటూ జిల్లాలోని 104 ఉద్యోగులు శుక్రవారం పెన్‌డౌన్ నిర్వహిస్తూ జిల్లా వైద్యాధికారి డా. జయచంద్రమోహన్‌కు నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం 8 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని, దీంతో తమ కుటుంబాలు పస్తులుండాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు పెన్‌డౌన్ చేపట్టామని, తమ సేవల్ని గుర్తించి వెంటనే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో 104 ఉద్యోగులు ప్రకాష్‌గౌడ్, శ్రీనివాస్, సత్యకుమార్, కృష్ణయ్య, రేణుక, స్వామి, రవికుమార్, వెంకటేష్, భాగ్యరేఖ తదితరులు పాల్గొన్నారు.
పురపాలికపై బీజేపీ జెండా ఎగరాలి
నారాయణపేట: రాబోయే పుర ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను అధికసంఖ్యలో గెలిపించాలని.. మున్సిపాలిటీపై జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పని చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు నాగూరావు నామాజీ పిలుపునిచ్చారు. గురువారం జిల్లాకేంద్రంలోని 19వ వార్డుకు చెందిన 50 మంది యువకులు పార్టీ పట్టణ అధ్యక్షుడు పోషల్ వినోద్ ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులు నాగూరావు నామాజీ, రతంగ్‌పాండురెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్ సమక్షంలో పార్టీలో చేరగా కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ యువత పెద్దసంఖ్యలో పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. పుర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని.. అందుకే పార్టీలో చేరినట్లు యువకులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా, పట్టణ నాయకులు పాల్గొన్నారు.
నేడు కోర్టు ప్రారంభం
నేడు కోర్టు ప్రారంభం


