మైనార్టీ గురుకులాల్లో ప్రవేశాలు
నారాయణపేట: మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రవేశాలకు సంబంధించిన ప్రచార కరపత్రాలను శుక్రవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత అధికారులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లా పరిధిలోని ఒక బాలుర, ఒక బాలికల గురుకులంలో 5వ తరగతిలో ప్రవేశాలకు అన్నివర్గాలకు, అలాగే 6, 7, 8వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లకు మైనార్టీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. అలాగే మక్తల్‌లోని టీజీఎంఆర్‌జేసీ (బాలికలు) ఎంపీసీ, బైపీసీలో, నారాయణపేటలోని బాలుర కళాశాలలో ఎంపీసీ, బైపీసీలో ప్రవేశాలకు tgmries telangana.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు సమీపంలోని పాఠశాల, కళాశాలలలో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో అధికారులు షమీం, జమీర్‌ఖాన్, మసూద్, ప్రిన్సిపాల్స్ జగదీశ్వర్, ఖాజా మహబూబ్‌ఖాన్, ఎలిజబెత్‌రాణి పాల్గొన్నారు.


