వైభవంగా క్షీరలింగేశ్వరుడి రథోత్సవం
క్షీరలింగేశ్వరస్వామి
రథోత్సవంలో
పాల్గొన్న భక్తజనం
కృష్ణా: మండల కేంద్రంలో బుధవారం శ్రీక్షీరలింగేశ్వరస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం నిర్వహించిన రథోత్సవానికి వివిధ ప్రాంతాల నుంచి వేలాది భక్తులు తరలివచ్చారు. ఆలయంలో స్వామివారి మూలవిరాట్ కు క్షీరాభిషేకం, మహా మంగళహారతి, బిల్వార్చన నిర్వహించారు. అనంతరం ప్రధాన ఆల యం నుంచి ఆలయ ధర్మకర్త ఎంకణ్ణగౌడ్ మంగళవాయిద్యాల మధ్య కలశంతో ఊరేగింపుగా రథం వద్ద చేరుకొని ప్రత్యేక పూజలు చేసి.. ఉత్సవమూర్తిని రథపై కొలువుదీర్చగా.. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. రథోత్సవం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ని ర్వహించారు. కార్యక్రమంలో మఠం పీఠాధిపతి బంతనల్ శ్రీవృశభలింగేశ్వర మహాస్వామి, నేరడగం పీఠాధిపతి శ్రీసిద్దలింగ మహాస్వామి, శ్రీక్షీరాలింగ మహాస్వామి పాల్గొన్నారు.


