సేవ చేయడం అదృష్టం..
ఆత్మకూర్‌లో వివేకానంద సేవాసమితిని నెలకొల్పిన నాటి నుంచి యువతను సేవా కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తున్నాం. రక్తదాన, వైద్యశిబిరాలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. పారిశుద్ధ్య కార్యక్రమాలు, విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహిస్తున్నాం. పేదలకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నాం.
– బాలు, సేవాసమితి అధ్యక్షుడు, ఆత్మకూర్
ఆత్మకూర్: పట్టణానికి చెందిన డాన్స్‌మాస్టర్ బాలు, మ్యాడం శ్రీను, ల్యాబ్ టెక్నీషియన్ రాజేశ్ తదితరులు ఎనిమిదేళ్ల క్రితం స్వామి వివేకానంద సేవాసమితిని నెలకొల్పి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం క్లాత్ సంచులను పంపిణీ చేస్తున్నారు. తలసేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తూ.. ఇప్పటివరకు 275 మందితో రక్తదానం చేయించారు. నేత్రం ఫౌండేషన్ సహకారంతో విద్యార్థుల్లో కంటి లోపాలను గుర్తించి.. చికిత్స అందేలా చూస్తున్నారు. యువతను క్రీడల్లో ప్రోత్సహిస్తున్నారు.
●
తలసేమియా బాధితులకు అండగా..
సేవ చేయడం అదృష్టం..


