భూములిచ్చిన రైతులకు సాష్టాంగ సమస్కారం
దామరగిద్ద: మక్తల్ –పేట– కొడంగల్ ప్రాజెక్టుకు భూములిచ్చిన రైతులకు ఊట్కూర్ మండలం బిజ్వార్ గ్రామానికి చెందిన జలసాధన సమితి నాయకుడు నర్సిములు వేదిక నుంచి సాష్టాంగ నమస్కారం చేశారు. పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంత రైతుల సంక్షేమం కోసం తరతరాల బాగు కోసం తమ సొంత భూములను ఇవ్వడానికి ముందుకు రావడంతోనే ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం చేపట్టే అభివృద్దికి సహకారం అందిందన్నారు. కేంద్ర ప్రభుత్వం డీపీఆర్ అనుమతులు ఇచ్చి ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర వాటాను అందించి ఈ ప్రాంత ప్రజల కల నెరేవేరేందుకు సహకరించాలని కోరారు.
కాలినడకన వచ్చిన రైతులు..
దామరగిద్ద తండాలో జరిగిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి మండలంలోని గడిమున్కన్‌పల్లి గ్రామ రైతులు కాలినడక తరలివచ్చారు. దామరగిద్ద నుంచి తండా వరకు ఎలాంటి వాహన సదుపాయం లేకపోవడంతో రైతులు కాలినడకన అక్కడికి చేరుకున్నారు. ఆటోలు, జీపులు, ఇతర వాహనాలు తండాకు వెళ్లవని, అందుకే కాలినడకన వెళ్లినట్లు ఈ సందర్భంగా రైతులు తెలిపారు.


