ముంపు గ్రామంగా ప్రకటించాలి
ఈ ప్రాజెక్టుతో ఎంతో మేలు జరుగుతుంది. కానీ ఊట్కూర్ గ్రామం చెరువు కట్ట కింద ఉంది. పునాదులు వేస్తే ఊట నీరు వస్తుంది. కాబట్టి ఈ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలి. లేని పక్షంలో మా ప్రాణాలకు తెగించి అడ్డుపడతాం. ఊట్కూర్ చెరువు శివారు ప్రాంతంలో జింకలు, నెమళ్లు సంచరిస్తుంటాయి. వాటిని సంరక్షించేందుకు వన్యప్రాణుల కేంద్రాలకు తరలిస్తారా.. కేంద్రాలను ఏర్పాటు చేస్తారా స్పష్టం చేయాలి. – ఎం.భరత్, రైతు, ఊట్కూర్
వేటికీ ముప్పు లేదు
జీఓ 69ను 2014 తర్వాత మూలకు పడేశారు. బీఆర్‌ఎస్ పాలనలో ఈ ప్రాజెక్టు ఊసేత్తలేదు. అయినా పోరాటాలు.. ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండు నెలల్లోనే ఈ ప్రాంత రైతుల కలను సాకారం చేయాలని ఈ ప్రాజెక్టుకు సీఎం రేవంత్‌రెడ్డి పునాది వేశారు. ఈ ప్రాజెక్టులో ఎలాంటి పర్యావరణ ముప్పులేదు. అనుమతులు ఇవ్వాలి.
– నర్సింమ, జలసాధన సమితి కో కన్వీనర్, పేట
ముంపు గ్రామంగా ప్రకటించాలి


