తాగునీటి సమస్య తీరనుంది
ఈ ప్రాజెక్టు చేపట్టడంతో పర్యావరణానికి నయా పైసా నష్టం లేదు. అడవి జంతులు, చెట్లు సమతుల్యత దెబ్బతనవు. పశు, మత్స్య సంపద అభివృద్ధి చెందుతుంది. తాగునీటి సమస్య తీరుతుంది. ఈ ప్రాజెక్టుతో పర్యావరణం మెరుగుపడుతుంది. వ్యవసాయం నిర్వీర్యం అవుతున్న సమయంలో పునరుజ్జీవం పోసినట్లవుతుంది. బోర్లు ఫెయిల్ అయి రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు, ముంబాయికి వలస వెళ్లి మృత్యువు చెందిన సంఘటనలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు చేపట్టడంతో ఎలాంటి పర్యావరణ సమస్యలు లేవు.
– వెంకట్రామరెడ్డి, భూ నిర్వాసితుల సంఘం గౌరవ అధ్యక్షుడు


