ఉన్నది ఉన్నట్లు సమర్పిస్తాం | - | Sakshi
Sakshi News home page

ఉన్నది ఉన్నట్లు సమర్పిస్తాం

Jan 9 2026 11:14 AM | Updated on Jan 9 2026 11:14 AM

ఉన్నద

ఉన్నది ఉన్నట్లు సమర్పిస్తాం

ర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో 28 మంది మాట్లాడిన అభిప్రాయాలన్నింటిని నమోదు చేసుకున్నాం. వీడియో చిత్రీకరణ చేశాం. మీటింగ్‌ మినిట్స్‌తో పాటు వీడియోను కాలుష్య నియంత్రణ మండలికి ఉన్నది ఉన్నట్లు సమర్పిస్తాం.

– సురేష్‌, ఈఈ, పీసీబీ హైదరాబాద్‌

ఏ గ్రామం ముంపునకుగురికాదు

ప్రాజెక్టులో ఏ గ్రామం ముంపునకు గురికావడం లేదు. 163 గ్రామాలకు తాగునీరు అందించేందుకు డిజైన్‌ అయింది. ఈ ప్రాజెక్టులో ఊట్కూర్‌ గ్రామం ముంపునకు గురయ్యే ఆస్కారమే లేదు. ఊట్కూరు మండల పరిసరాలలో సంచరించే జింకలను సంరక్షణ కేంద్రానికి తరలించేందుకు బడ్జెట్‌ కేటాయించడం జరిగింది. – శ్రీధర్‌, ఎస్‌ఈ, నీటి పారుదల శాఖ

ప్రాజెక్టుతో ఆర్థిక వ్యవస్థ మెరుగు

ప్రాజెక్టు చిట్టెం నర్సిరెడ్డి కన్న కల. చిట్టెం వెంకటేశ్వర్‌రెడ్డి దీనికోసం పాదయాత్ర చేశారు. ఈ ప్రాంతంలో రాళ్లు తేలిన భూములు కనిపిస్తాయి. వన్యం లేదు.. వన్యప్రాణులు లేవు. నీళ్లు ఉంటే వన్యప్రాణులు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్టుతో ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. పర్యావరణ అనుమతులు త్వరగా ఇస్తే ప్రాజెక్టు ఈ నెలలోనే ప్రారంభించుకునే అవకాశం ఉంది. అనుమతులు ఇవ్వాలని కోరుతున్నాం.

– కుంభం శివకుమార్‌రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు

ఉన్నది ఉన్నట్లు సమర్పిస్తాం 
1
1/1

ఉన్నది ఉన్నట్లు సమర్పిస్తాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement