దరఖాస్తుల ఆహ్వానం
మద్దూరు: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కాంట్రాక్టు పద్ధతిన కంప్యూటర్ సైన్స్ బోధించేందుకు గాను అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ బి.కృష్ణారెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పీజీలో 55 శాతం మార్కులు, సెట్ లేదా నెట్ కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి, అర్హులైన అభ్యర్థులు ఈ నెల 8వ తేదీ వరకు డిగ్రీ కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
జాతీయ నెట్‌బాల్ టోర్నీకి గురుకుల విద్యార్థి
ధన్వాడ: మండలంలోని కొండాపూర్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి హరీశ్ జాతీయస్థాయి నెట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. ఇటీవల నల్లగొండ జిల్లాలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో అతడు అత్యంత ప్రతిభ చాటడంతో రాష్ట్ర జట్టుకు ఎంపిక చేసినట్లు ప్రిన్సిపాల్ రాజారాం తెలిపారు. ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు రాజస్థాన్ రాష్ట్రంలో జరిగే 69వ జాతీయస్థాయి ఎస్‌జీఎఫ్ అండర్–17 బాలుర నెట్‌బాల్ పోటీల్లో హరీశ్ పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని కోచ్ డా.రామ్మోహన్‌గౌడ్, పీఈటీ ఆంజనేయులు, హౌస్ మాస్టర్ తిమ్మప్ప, సంజీవ్ అభినందించారు.
ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వండి
నారాయణపేట రూరల్: ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయులతో పాటు ఇంటర్ అధ్యాపకులకు రాబోయే మున్సిపల్ ఎన్నికల విధులు కేటాయించకుండా మినహాయింపు ఇవ్వాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్‌లో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటర్, పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా చూడాలన్నారు. అదే విధంగా గర్భిణులు, బాలింతలు, దివ్యాంగులు, పదవీ విరమణ చేరువలో ఉన్నవారు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వారికి విధులు కేటాయించకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవాలని.. కేడర్ స్ట్రెంత్ అప్‌డేట్ చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నాయకులు రఘువీర్, రాంరెడ్డి, కృష్ణ పాల్గొన్నారు.
అలసందలు క్వింటా రూ.5,611
నారాయణపేట/జడ్చర్ల/దేవరకద్ర: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో మంగళవారం అలసందలు క్వింటా రూ. 5,611 ధర పలికింది. అదే విధంగా వరిధాన్యం (సోన) గరిష్టంగా రూ. 2,683, కనిష్టంగా రూ. 2,603, ఎర్రకందులు గరిష్టంగా రూ. 8,011, కనిష్టంగా రూ. 4,506, తెల్లకందులు గరిష్టంగా రూ. 8,181, కనిష్టంగా రూ. 6,516 ధరలు వచ్చాయి.
● బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డులో మంగళవారం ధాన్యం ఆర్‌ఎన్‌ఆర్ క్వింటా గరిష్టంగా రూ.2,739, కనిష్టంగా రూ.1,781 ధరలు లభించాయి. హంస రూ.1,866, కందులు గరిష్టంగా రూ.7,060, కనిష్టంగా రూ.3,561, వేరుశనగ గరిష్టంగా రూ.8,840, కనిష్టంగా రూ.6,886, మినుములు రూ. 8,401, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,956, కనిష్టంగా రూ.1,630 ధరలు పలికాయి. దేవరకద్రలో కందులు గరిష్టంగా రూ. 6,759, కనిష్టంగా రూ.6,159 ధర లభించింది.
దరఖాస్తుల ఆహ్వానం


