మద్దూరు: విద్యార్థులు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అన్నారు. గురువారం మద్దూరు బాలికల గురుకుల పాఠశాలలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు విద్యార్థులతో మాట్లా డి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలలోని ఆర్‌ఓ ప్లాంట్‌ను అడిషనల్ కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులతో కలిసి మధ్యా హ్న భోజనం చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పెదిరిపాడ్ రోడ్డులో ఉన్న విద్యార్థుల వసతిగృహాన్ని ఇక్కడికే మార్చాలని అధికారులకు సూ చించారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, ఎంపీడీఓ రహ్మతుద్దీన్ ఉన్నారు.
నష్టపరిహారం చెల్లించండి
నారాయణపేట టౌన్: జిల్లాలోని పెద్ద చింతకుంట నుంచి గుడెబల్లూర్ వరకు చేపట్టిన భారత్‌మాల రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వాసిత రైతులు మాట్లాడుతూ.. భారత్‌మాల రోడ్డు కోసం ఐదేళ్ల క్రితం 19 గ్రామాల్లో సర్వే చేపట్టారని, ఇప్పటి వరకు 10శాతం మందికి కూడా నష్టపరిహారం చెల్లించలేదని తెలిపారు. భూ నిర్వాసితులకు వారం రోజుల్లో నష్టపరిహారం చెల్లించాలని.. లేనిచో జాతీయ రహదారిని దిగ్బంధిస్తామని హెచ్చరించారు. అనంతరం ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో గణేశ్, విజయ్, మారుతి, రంగారెడ్డి, శీను, శివకుమార్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
22 నుంచి ‘ఓపెన్’ పరీక్షలు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: వచ్చే నెల 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఓపెన్ స్కూల్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈఓ ప్రవీణ్‌కుమార్, ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ శివయ్య ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ సబ్జెక్టుల వారీగా తేదీల టైం టేబుల్ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉందని, విద్యార్థులు పరీక్షలకు సిద్దం కావాలన సూచించారు. ఉదయం సెషన్‌లో టెన్త్, మధ్యాహ్నం ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.