
సరిహద్దు ప్రాంతాల నుంచి..
జిల్లాలోని మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాల్లోని పలు గ్రామాలు, పట్టణాలు తెలంగాణ–కర్ణాటక సరిహద్దుకు ఆనుకొని ఉన్నాయి. అయితే సరిహద్దులోని ఫర్టిలైజర్స్ దుకాణాల్లో కర్ణాటక ప్రాంత రైతులకు ఎరువులు విక్రయించినట్లు తెలుస్తోంది. తెలంగాణ రైతుల పట్టాదారు పాస్‌పుస్తకాలు, ఆధార్‌కార్డులతో ఎరువులను పక్కదారి పట్టించినట్లు బహిరంగంగా చర్చ సాగుతోంది. ఇటీవల నారాయణపేట మండలంలోని జలాల్‌పూర్ చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టగా.. కాంప్లెక్స్ ఎరువులు, యూరియా పట్టుబడింది. కర్ణాటక ప్రాంతానికి ఎరువులను తరలిస్తున్న వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. దీంతో సరిహద్దు ప్రాంతాల్లోని దుకాణాలపై పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులు నిఘా పెంచారు.