
కనులపండువగా శివపార్వతుల కల్యాణం
నారాయణపేట రూరల్: పట్టణంలోని శివలింగేశ్వర దేవాలయం 6వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాభిషేకం, బిల్వర్చన, విశేష పుష్పాలంకరణ, మహా మంగళహారతి నిర్వహించారు. అనంతరం అర్చకులు జంగం మాడపటి మఠం శివకుమార్, రాయచూరు శివకుమార్ ఆధ్వర్యంలో శివపార్వతుల కల్యాణ మహోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా కర్ణాటక రాష్ట్రం కలబురిగి జిల్లా సావుళ్గిగి మఠం పీఠాధిప గురునాథ స్వామి హాజరై భక్తులకు ఆశీర్వచనం అందించారు. అనంతరం అన్నదానం చేశారు. అంతకుముందు శివపార్వతుల విగ్రహాలు పట్టణ పురవీధుల గుండా శోభాయాత్రగా ఖడ్గాలు చదువుతూ ఊరేగింపుగా తీసుకొచ్చారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రవికాంత్, మల్లికార్జున్, రవికుమార్, నాగభూషణం, రఘుబాబు, శంక్రన్న, కన్న జగదీష్, మల్లికార్జునమ్మ, మాజీ మున్సిపల్ చైర్మెన్ అనసూయ, చంద్రకాంత్, మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి, మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు ఉమాకాంత్, ట్రస్మ అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి, చిట్టెం మాధవరెడ్డి పాల్గొన్నారు.