
క్రీడలకు అధిక ప్రాధాన్యం
● గ్రామీణ క్రీడాకారులు
జాతీయస్థాయికి ఎదగాలి
● రాష్ట్ర మత్స్య, క్రీడాశాఖ మంత్రి
వాకిటి శ్రీహరి
మక్తల్‌లో 2కే రన్ ప్రారంభిస్తున్న
మంత్రి వాకిటి శ్రీహరి
మక్తల్: ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర మత్స్య, క్రీడల యువజన సర్వీసులశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. జాతీయ క్రీడల దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం మక్తల్ పట్టణంలోని నల్లజానమ్మ ఆలయం వద్ద మంత్రి 2కే రన్ ప్రారంభించగా.. అంబేడ్కర్ చౌరస్తా వరకు ఉత్సాహంగా కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం క్రీడాకారులకు అన్నివిధాలా ప్రోత్సాహం అందిస్తోందన్నారు. రూ.కోట్లతో క్రీడా వసతులు కల్పించడంతో పాటు స్టేడియాలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. క్రీడలు క్రమశిక్షణ, స్నేహభావాన్ని పెంపొందిస్తాయని.. గ్రామీణ యువత క్రీడల్లో ప్రావీణ్యం పెంచుకొని రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించాలని సూచించారు. ఈ నెల 23నుంచి 31వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
● అర్హులైన పేదలందరికీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తుందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మక్తల్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జక్లేర్, కాట్రేవ్‌పల్లి, ఖానాపూర్, రుద్రసముద్రం, పారేవుల గ్రామాలకు చెందిన 78మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మక్తల్ నియోజకవర్గంలో రూ. 175కోట్లతో 3,500 ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం అందించే ఆర్థికసాయంతో లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్లను నిర్మించుకొని సొంతింటి కలను సాకారం చేసుకోవాలన్నారు. లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ జోక్యం లేకుండా.. అందరికీ సముచిత న్యాయం చేస్తున్నట్లు చెప్పారు. లబ్ధిదారుల నుంచి ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమాల్లో డీవైఎస్‌ఓ వెంకటేశ్ శెట్టి, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ గణేశ్‌కుమార్, ఎంపీడీఓ రమేశ్, తహసీల్దార్ సతీశ్‌కుమార్, నాయకులు విష్ణువర్ధన్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ కోళ్ల వెంకటేశ్, రవికుమార్, కట్ట సురేశ్, వెంకటేశ్, రాజేందర్, ఎండీ సలాం, శ్రీనివాసులు, నరేందర్, నారాయణ, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.