
పత్తి రాలిపోతుంది
ఐదు ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశాను. ఒక్కో ఎకరాకు ఇప్పటికే రూ.30 వేలు ఖర్చు చేశాను. పంట బాగా వస్తుందని ఆశపడ్డా. కానీ గత 15 రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలతో పొలంలో నీళ్లు నిలిచి ఎర్రతేగెళ్లు సోకింది. పూత రాలిపోవడంతో చెట్టుకు కాయలు లేకుండాపోయాయి. అప్పులే మిగులుతాయన్న భయం వెంటాడుతోంది. – రాజు, రైతు, మరికల్
నిండా ముంచింది..
రెండు ఎకరాల్లో పత్తి సాగు చేశాను. ఎప్పుడూ లేని విధంగా ఈ సారి 15 రోజుల నుంచి వర్షాలు విడవడంలేదు. విత్తనాలు నాటిన సమయంలో వర్షాలు రాక అలా నష్టపోతే.. ప్రస్తుతం పంట పూత, కాయ దశలో ఉండగా రోజుల తరబడి వర్షాలతో పూత, కాయ రాలిపోతుంది. గతేడాది కూడా ఇలాగే వర్షాలు రావడంతో రూ.50 వేల నష్టం వచ్చింది. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి ఏర్పడితే పంటలు వేయడం మానేయాల్సిందే.
– నర్సిములు, రైతు, చిత్తనూర్
●

పత్తి రాలిపోతుంది