
నా జీవితం ప్రజాసేవకే అంకితం
నారాయణపేట: ‘‘ఈ ప్రాంతంలోని జాయమ్మ చెరువు ద్వారా రైతులకు సాగునీరు అందించడమే మా తాత చిట్టెం నర్సిరెడ్డి లక్ష్యం.. అన్నిరంగాల్లో సమగ్రాభివృద్ధి చేయాలన్నదే మా నాన్న ఆశయ సాధన.. ఈ ప్రాంత అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం చిట్టెం కుటుంబం చివరిశ్వాస వరకు పనిచేస్తుంది.. నా జీవితం ప్రజా సేవకే అంకితం’’ అని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. బుధవారం ఎమ్మెల్యే పర్ణికారెడ్డి జన్మదినం సందర్భంగా జిల్లా కేంద్రంలోని శక్తిపీఠంలో అమ్మవారికి ప్రత్యేక పూజ లు చేశారు. అనంతరం ఓ ఫంక్షన్‌హాల్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే ఘనంగా జరుపుకొన్నారు. మరికల్ మండల నాయకుడు సూర్యమోహ న్ రెడ్డి ఆధ్వర్యంలో గజమాలతో సత్కరించి జన్మదిన శు భాకాంక్షలు తెలిపారు. అదే విధంగా జిల్లా యు వజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటుచేయగా.. 30మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లా డుతూ.. ఓ ఆశయం కోసం తన మేనమామ కుంభం శివకుమార్‌రెడ్డి 20 ఏళ్లుగా చేసిన కష్టానికి అందరూ తోడు కావడంతో తాను ఈ స్థాయిలో ఉన్నానన్నారు. త్వరలోనే ఈ ప్రాంతానికి సాగునీరు అందించి సస్యశ్యామలం చేస్తామన్నారు. కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమా ర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ హరినారాయణ భట్టడ్, పట్టణ అధ్యక్షుడు ఎండీ సలీం, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బండి వేణుగోపాల్, సరాఫ్ నాగరాజ్, సుధాకర్, రవీందర్ రెడ్డి, చంద్రకాంత్, బోయ శరణప్ప, నరహరి, వీరన్న, రవీందర్, విద్యాసాగర్‌గౌ డ్, పీఏసీఎస్ చైర్మన్లు పుట్టి ఇదప్ప, కె.నర్సింహారెడ్డి, వెంకట్రామారెడ్డి, కాంత్‌కుమార్ పాల్గొన్నారు.

నా జీవితం ప్రజాసేవకే అంకితం