
ప్రతి ఏటా అవస్థలే..
● మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అప్పనపల్లి, దివిటిపల్లి, న్యూమోతీనగర్, ఏనుగొండ, బండమీదపల్లి (పాలిటెక్నిక్ కళాశాల దారి), మన్యంకొండ స్టేషన్ దగ్గర సూగురుగడ్డ ఆర్‌యూబీల్లో వరద నీరు పారడం నిత్యకృత్యంగా మారింది. ప్రతి ఏటా పలు కాలనీలు, గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నా.. అధికారులు శాశ్వత చర్యల దిశగా అడుగులు వేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
● దేవరకద్రలోని దళితవాడ వద్ద ఆర్‌యూబీ గుండా రైతులు రాకపోకలు కొనసాగిస్తుంటారు. భారీ వర్షం వస్తే అండర్ పాస్‌లో మోకాళ్ల లోతులో నీళ్లు నిలుస్తున్నాయి. వ్యవసాయ పనులకు ఆటంకాలు ఎదురవుతుండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
● జడ్చర్ల నుంచి ఆలూరు గ్రామానికి వెళ్లే దారిలో ఉన్న ఆర్‌యూబీలో నీళ్లు నిలుస్తుండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ప్రస్తుతం నీరు సాఫీగా వెళ్లేందుకు పైపులైన్ వేసే పనులు కొనసాగుతున్నాయి.