
అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా
మక్తల్: నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నానని పశుసంవర్ధక, మత్స్య, క్రీడల యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. రాష్ట్రంలో పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంని తెలిపారు. బుధవారం ఆయన మక్తల్ పెద్ద చెరువు అలుగును పరిశీలించారు. నల్లజానమ్మ ఆలయం వద్ద నూతనంగా రోడ్డుడ్యాం నిర్మాణ పనుల గురించి ఆరా తీశారు. నియోజకవర్గ కేంద్రానికి రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరయ్యిందని పేర్కొన్నారు. దీంతో పేద విద్యార్థులు నాణ్యమైన విద్య అందుతుందన్నారు. అన్ని మండలాలు, గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే రూ.833.50 కోట్లు మంజూరయ్యాయని వెల్లడించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పనలో భాగంగా రూ.15.13 కోట్లు కేటాయించామన్నారు. అందరి సహాకారంతో మక్తల్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కోళ్ల వెంకటేష్, రవికుమార్, బోయ నర్సింహ, రాజేందర్, ఆనంద్‌గౌడ్, నాగరాజు, నారాయణ, గోవర్ధన్, నీలప్ప, దండు రాము, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
రైతు సంక్షేమానిక కృషి
మక్తల్‌లో రాష్ట్ర ఉత్పత్తులదారుల సంఘాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల ఆదాయం పెంచేందుకు సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. సహకార పద్ధతిలో దళారి వ్యవస్థకు తావులేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పాల ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్‌లో రైతులకు భాగస్వామ్యం పెరగడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. కార్యక్రమంలో లక్ష్మారెడ్డి, గడ్డంపల్లి హన్మంతు, కట్ట సురేష్, కోళ్ల వెంకటేష్, తిరుపతి, నర్సిములు తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి పరామర్శ
మాద్వార్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బొంబాయి నర్సిములు, ఉందెకోడ్ సాబెన్న అనారోగ్యంతో మృతి చెందడంతో మంత్రి వాకిటి శ్రీహరి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.