అధికారం ఉంది.. అన్ని సీట్లు మావే అని భావించిన ఆళ్లగడ్డ టీడీపీ నాయకులు కౌంటింగ్ ముందే విధ్వంసకాండకు పాల్పడ్డారు. పచ్చగూండాలు శుక్రవారం అర్థరాత్రి వైఎస్సార్సీపీ ముస్లిం మైనార్టీ నాయకురాలు షరీఫాబీకి చెందిన రెండుకార్లను పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఈ విషయంపై నియోజకవర్గ ఇన్చార్జి గంగుల బిజేంద్రారెడ్డి స్పందిస్తూ ఇదంతా ఎమ్మెల్యే అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్ పనేనన్నారు. అనంతరం నంద్యాలలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి జిల్లా ఎస్పీ సునీల్షోరాణ్ను కలిసి ఫిర్యాదు చేశారు.


