గోస్పాడు
సాక్షి, నంద్యాల: నామినేషన్లకు అడ్డంకులు, స్క్రూటినీలో తీసివేతలు, విత్‌డ్రాలో బెదిరింపులు ఇన్ని చేసినా కూడా నంద్యాల జిల్లాలో వైఎస్సార్‌సీపీకి ఎదురులేదని మరోసారి రుజువైంది. జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వానికి ఓటర్లు షాకిచ్చా రు. అదే విధంగా పరిషత్ పోరులో కూడా ప్రభుత్వ వ్యతిరేకత ఉందని మళ్లీ నిరూపించారు. జిల్లాలో మొత్తం 28 జెడ్పీటీసీ స్థానాలుండగా 8 ఏకగ్రీవం అయ్యాయి. 377 ఎంపీటీసీ స్థానాలకు గాను 152 ఏకగ్రీవమయ్యాయి. 225 స్థానాలకు, 20 జెడ్పీటీసీ స్థానాలకు ఈనెల 5వ తేదీన పోలింగ్ జరుగగా శనివారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఎన్నికల ఫలితాల్లో రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ ప్రాతినిథ్యం వహిస్తున్న నంద్యాల నియోజకర్గంలో రెండు మండలాల్లో టీడీపీకి భారీ ఓటమి ఎదురైంది. నంద్యాల, గోస్పాడు మండలాల్లో 27 ఎంపీటీసీ స్థానాలకుగాను వైఎస్సార్‌సీపీ 21 స్థానాలను కై వసం చేసుకోగా టీడీపీ కేవలం 06 స్థానాలకు పరిమితమైంది. నంద్యాల, గోస్పాడు జెడ్పీటీసీలు కూడా వైఎస్సార్‌సీపీ కై వసం చేసుకుంది. దీంతో నంద్యాల గడ్డ వైఎస్సార్‌సీపీ అడ్డా అని మరోసారి రుజువైంది. జిల్లాలో 28 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా ఇందులో ప్యాపిలి ఏకగ్రీవం కాగా, బండిఆత్మకూరు, పాములపాడు, గో స్పాడు, నంద్యాల జెడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్‌సీపీ కై వసం చేసుకుంది. జిల్లాలో మొత్తం 377 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. ఇందులో వైఎస్సార్‌సీపీ 141, టీడీపీ 229, జనసేన 5, ఇతరులు రెండు స్థానాల్లో గెలుపొందారు. జిల్లాలో 28 జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ 5, టీడీపీ 23 స్థానాల్లో గెలిచాయి.
వైఎస్సార్ సీపీ నేతల అక్రమ అరెస్టు..
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఉదయాన్నే నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవించంద్రకిశోర్ రెడ్డి, మాజీ శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, కర్నూలులో వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ఆళ్లగడ్డలో మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్‌రెడ్డి, ఆత్మకూరులో వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు శిల్పా భువనేశ్వర్‌రెడ్డి ఇళ్ల వద్దకు చేరుకుని హౌస్ అరెస్ట్ చేశారు. శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి ఏజెంట్ పాస్ ఉన్నా కూడా పోలీసులు బయటకు వెళ్లకూడదంటూ అడ్డుకున్నారు. టీడీపీ నాయకులు మాత్రం కౌంటింగ్ కేంద్రం వద్ద యథేచ్చగా తిరుగుతూ హల్‌చల్ చేశారు. నందికొట్కూరులో ఎమ్మెల్యే గిత్తా జయసూర్య పీఏ రవీంద్ర కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లి నిబంధనలను ఉల్లంఘించినా అధికారులు అడ్డుకోలేదు.
వనిపెంట శ్రీదేవి
కృష్ణమూర్తి, ప్యాపిలి
వేల్పుల జయపాల్, పాములపాడు
వెంకటరామిరెడ్డి
పెద్ద నరసింహుడు


