మహానంది మండలం అబ్బీపురం గ్రామ వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా షేక్ నూర్‌బాషా పోటీ చేశారు. అయితే కౌంటింగ్‌లో ఉదయం 11.30 గంటలకు 17 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి కృష్ణగౌడ్‌పై గెలిచినట్లు రిటర్నింగ్ అధికారులు చెప్పినా సాయంత్రం 4 గంటల వరకు కూడా డిక్లరేషన్ పత్రం ఇవ్వడంలో జాప్యం చేశారు. దీంతో డిక్టరేషన్ ఫారం కోసం గంటల తరబడి ఎదురు చూసిన ఆయన విసుగు చెంది ఫారం ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ కౌంటింగ్ కేంద్రం వద్ద ఆందోళన చేశాడు. అయినా స్పందించని అధికారులు రీ కౌంటింగ్ చేపట్టారు. చివరకు షేక్‌నూర్‌బాషా 15 ఓట్ల తేడాతో గెలిచినట్లు ధ్రువీకరించి డిక్లరేషన్ పత్రం అందజేశారు.


