కారు బీభత్సం | - | Sakshi
Sakshi News home page

కారు బీభత్సం

Nov 5 2026 1:46 AM | Updated on Nov 5 2026 1:46 AM

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

కర్నూలు: నగర శివారులోని నందికొట్కూరు రోడ్డులో సెయింట్‌ జోసెఫ్‌ జూనియర్‌ కళాశాల సమీపంలో మద్యం మత్తులో ఉన్న ఇద్దరు కారుతో బీభత్సం సృష్టించారు. కర్నూలు నుంచి వెంకాయపల్లె వైపు వెళ్తూ సెయింట్‌ జోసెఫ్‌ కళాశాల వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆటోను వేగంగా ఢీకొట్టడంతో అది ముందుకు దూసుకెళ్లి కల్వర్టును బలంగా తాకింది. ఆటోలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసం కాగా, అందులో మద్యం సీసాలు, స్నాక్స్‌ లభించాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కృష్ణగిరి: జాతీయ రహదారి 44పై బుధవారం సాయంత్రం మండల పరిధిలోని అమకతాడు టోల్‌ప్లాజా సమీపాన రోడ్డు ప్రమాదం జరిగింది. టోల్‌ప్లాజా వద్ద సెన్సార్‌ టోల్‌ప్లాజా కోసం పనులు జరుగుతుండటంతో దారిని ఒక వైపు మూసి వేశారు. దీంతో వాహనాలన్నీ డోన్‌ నుంచి టోల్‌ప్లాజాకు వచ్చే దారిలో వెళుతున్నాయి. ఈ సమయంలో అమకతాడు స్టేజీ వద్ద ఓ ఆటో ప్రయాణికులను దింపేందుకు ఆగింది. వెనుక వచ్చిన టాటా ఏస్‌ డ్రైవర్‌ షేక్‌ సొహైల్‌ ఆటోను గమనించి వాహన వేగం తగ్గించాడు. ఇంతలో వెనుక వేగంగా దూసుకొచ్చిన కంటైనర్‌ టాటా ఏస్‌ వాహనాన్ని ఢీకొట్టింది. టాటాఏస్‌ ముందుకు దూసుకెళ్లగా డ్రైవర్‌ ప్రయాణికుల ఆటోను ఢీకొట్టకుండా తప్పించే క్రమంలో పక్కకు తిప్పగా సింగిల్‌ వేలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో టాటాఏస్‌ డ్రైవర్‌ సొహైల్‌, క్లీనర్‌ ఇర్ఫాన్‌ గాయపడ్డారు. వెంటనే వారిని మెరుగైన వైద్యం కోసం కర్నూలు తరలించినట్లు స్థానికులు తెలిపారు. గాయపడ్డ డ్రైవర్‌ సొహైల్‌ కల్లూరులోని ముజఫర్‌నగర్‌ వ్యక్తి కాగా, క్లీనర్‌ ఇర్ఫాన్‌ పందిపాడు గ్రామ వాసిగా తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement