మంత్రాలయం:ప్రకృతి వైభవం, పర్యావరణ స్పృహ నిమిత్తం ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం మంత్రాలయంలో రాఘవ సరోవర్ పేరుతో సరస్సు నిర్మించనున్నారు. బుధవారం రాఘవేంద్రస్వామి పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు సరస్సు నిర్మాణానికి భూమి పూజ గావించారు. 167వ జాతీయ రహదారిని ఆనుకుని చెట్నెహళ్లి గ్రామ మార్గంలోని అభయ రామ విగ్రహంతో ఈ సరోవర్ నిర్మాణం చేపట్టనున్నారు. 25 ఎకరాల విస్తీర్ణంలో పచ్చని చెట్లు, ఆయుర్వేద మొక్కలు, పచ్చిక మైదానాలు, వాటర్ ఫౌంటెన్లు ఇందులో ఏర్పాటు చేయనున్నారు. శ్రీమఠానికి విచ్చేసే భక్తులకు ఆహ్లాదం పంచేందుకు ప్రకృతి ప్రేమికుల కోసం ఈ సరోవర్ నిర్మిస్తున్నట్లు పీఠాధిపతి వివరించారు. సరోవర్ నిర్మాణానికి కర్ణాటకలోని బెంగుళూరుకు చెందిన మదన్పాటిల్ అనే వ్యాపారవేత్త రూ.25 లక్షలు విరాళంగా అందజేశారు. డాక్టర్ సీపీ మంజునాథ్, మేనేజర్లు శ్రీనివాసరావు, వెంకటేష్జోషి, ఈఈ సురేష్ కోనాపూర్, సంస్కృత పాఠశాల రిటైర్డు ప్రిన్సిపాల్ వాదీరాజాచార్ పాల్గొన్నారు.


