కర్నూలు (టౌన్): అప్రజాస్వామికంగా నిర్వహించిన బోగస్ ఎన్నికలకు ప్రజాధనం వృథా చేశారని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి మద్దూరు సుభాష్ చంద్రబోస్ విమర్శించారు. ఆయన బుధవారం తన కార్యాలయంలో మాట్లాడుతూ.. అధికారం అడ్డుపెట్టుకొని కూటమి ప్రభుత్వం మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఎన్నికల్లో నామినేషన్ల నుంచి కూటమి నాయకులు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై దాడులు, దౌర్జన్యాలు చేశారన్నారు. పోలింగ్ రోజున బూత్‌లను ఆక్రమించి నిస్సిగ్గుగా రిగ్గింగ్, సైక్లింగ్ ద్వారా దొంగ ఓట్లు వేసుకున్నారని ధ్వజమెత్తారు. చివరకు కౌంటింగ్ కేంద్రాల్లో కొన్ని చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలుపొందినా కౌంటింగ్ అధికారులపై ఒత్తిడితెచ్చి టీడీపీ అభ్యర్థులు గెలుపొందినట్లు డిక్లరేషన్ చేయించుకునే స్థితికి దిగజారరని యద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ ఇంత అరాచకాలు జరగలేదని రాష్ట్రంలో గత నాలుగు దశాబ్దాలుగా ఎన్నికల్లో ఇటువంటి హింస జరగలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పాలనలో ఇంత హింసాత్మకంగా, దౌర్జన్యంగా ఎన్నికలు నిర్వహించడాన్ని ప్రజలు ఛీ కొడుతున్నారన్నారు. అధికారం ఉపయోగించి అక్రమ మార్గాల్లో గెలుపొందిన కూటమి నాయకులది గెలుపే కాదని విమర్శించారు. ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న కూటమికి పాపం పండక తప్పదని హెచ్చరించారు.
కుక్కల దాడిలో
జింక పిల్ల మృతి
డోన్ టౌన్: మండలంలోని వెంకటాపురం గ్రామ సమీప పొలాల్లో బుధవారం వీధికుక్కలు దాడి చేయడంతో ఒక నెల వయసున్న జింక పిల్ల మృతి చెందింది. గ్రామ సమీపంలోని మాగాణి ప్రాంతంలో వందల సంఖ్యలో జింకలు సంచరిస్తుంటాయి. ఇటీవల జన్మించిన ఒక జింక పిల్ల తల్లితో వెళుతుండగా వీధి కుక్కలు వెంబడించాయి. బెదిరిన తల్లి పారిపోగా జింక పిల్ల కుక్కలకు చిక్కడంతో కొరికి చంపినట్లు పశువుల కాపర్లు తెలిపారు. జింక పిల్ల కళేబరాన్ని కుక్కలు పీక్కుతిన్నట్లు తెలిసింది. అటవీశాఖ అధికారులు ఇక్కడ సంచరించే జింకలను సంరక్షణ కేంద్రాలకు తరలించాలని, దీంతో వాటి సంతతి పెరుగుదలతో పాటు రైతుల పొలాలను కాపాడిన వారు అవుతారని ప్రజలు భావిస్తున్నారు.
7న రగ్బీ జట్ల ఎంపిక
కర్నూల్ టౌన్: స్థానిక స్పోర్ట్స్ అథారిటీ అవుట్‌డోర్ స్టేడియంలో ఈనెల 7వ తేదీన ఉమ్మడి జిల్లాస్థాయి సబ్ జూనియర్ అండర్ –15 రగ్బీ జట్ల ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా రగ్బీ సంఘం కార్యదర్శి రామాంజనేయులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2011, 2012, 2013 సంవత్సరాల్లో జన్మించిన బాలబాలికలు ఈ ఎంపిక పోటీల్లో పాల్గొనేందుకు అర్హులని తెలిపారు. ప్రతిభ కనబరచి ఎంపికై న క్రీడాకారులు ఈనెల 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించే రాష్ట్రస్థాయి రగ్బీ సబ్ జూనియర్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు. ఆసక్తి కలిగి ఎంపిక పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ఆధార్ జిరాక్స్ వెంట తీసుకురావాలని సూచించారు.
సుభాష్ చంద్రబోస్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి


