సబ్సిడీ శనగ విత్తన కేటాయింపులు, సరఫరా వివరాలు..
కేటాయింపు (క్వింటాళ్లు)
(క్వింటాళ్లు)
గడివేముల (మండలాలు)
● శనగ సాగుకు
ఈ నెలాఖరు వరకే అదను
● విత్తనాల పంపిణీలో
చంద్రబాబు ప్రభుత్వం విఫలం
● ఏపీ సీడ్స్ కంపెనీకి ప్రభుత్వం డబ్బులు చెల్లించలేదు.
● మార్కెట్ ధరకు రాయితీ ధరకు మధ్య ఽతేడా ఉంది.
● రిజిస్ట్రేషన్ చేయించుకున్న రైతులకే ఇప్పటి వరకు విత్తనాలు ఇవ్వలేదు.
● కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఆస్కారం లేకుండా పోయింది.
● వర్షం కురిసి సకాలంలో విత్తనాలు అందితే పొలంలో విత్తనం పడుతుంది.
● ఈ ఏడాది సాగుపై ఆశలు వదులుకోవాల్సిందేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గుళ్లదూర్తి సమీపంలో పొలాన్ని
సిద్ధం చేసుకుంటున్న రైతు
కోవెలకుంట్ల: పప్పుశనగ సాగుపై ఈ ఏడాది నీలినీడలు అలుముకున్నాయి. అక్టోబర్ రెండో వారం నుంచి నెలాఖరు వరకు విత్తనానికి సరైన అదును. వర్షాలు అధికమైతే నవంబర్ రెండవ వారం వరకు విత్తనం వేసుకునే అస్కారం ఉంటుంది. అయితే ఈ ఏడాది ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో సబ్సిడీ విత్తనాలు ఇవ్వలేదు. పంపిణీ ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింది. జిల్లాలో 60 వేల హెక్టార్లలో పప్పుశనగ సాగు లక్ష్యం అయితే.. ప్రభుత్వం 60 వేల క్వింటాళ్ల విత్తనాలు కేటాయించాల్సి ఉంది. ఎకరాకు 40 కిలోలు చొప్పున అవసరమవుతాయి. అయితే ప్రభుత్వం జిల్లాకు మొదటి విడతలో 36,574 క్వింటాళ్ల విత్తనాలు కేటాయించి 23,730 క్వింటాళ్లను మాత్రమే సరఫరా చేసింది.
అరకొరగా విత్తనాల సరఫరా!
జిల్లాలో అక్టోబర్ నెల సాధారణ వర్షపాతం 117.9 మి.మీ. కాగా ఇప్పటి వరకు ఒక్క మి.మీ. వర్షపాతం నమోదు కాలేదు. గత నెలలో అరకొరగా కురిసిన వర్షాలకు రైతులు పొలాల్లో రసాయన మందులు వేసుకుని విత్తనానికి సిద్ధంగా ఉన్నారు. కొందరు రైతులు దేవుడిపై భారం వేసి వారం రోజుల క్రితమే శనగ పంట సాగుచేశారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో అల్లాడుతున్న రైతులను ఆదుకునేందుకు చంద్రబాబు సర్కార్ ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడంలో విఫలమైంది. ప్రస్తుత మార్కెట్‌లో శనగ క్వింటా రూ. 7 వేలకు పైగా ధర పలుకుతోంది. ప్రభుత్వం క్వింటా రూ. 9వేలు ధర నిర్ణయించింది. సబ్సిడీపై రూ. 5,850 చొప్పున రైతులకు సరఫరా చేయాల్సి ఉంది. అయితే అరకొరగా విత్తనాలు సరఫరా చేసి చేతులు దులుపుకుంది.
నియోజకవర్గం విత్తన సరఫరా
బనగానపల్లె 16,985 9,609
ఆళ్లగడ్డ 9,489 6,109
నందికొట్కూరు 5,885 5,039
నంద్యాల 1,105 1,105
శ్రీశైలం 990 370
డోన్ 750 648
పాణ్యం, 1,030 850


