ఓటమి భయంతోనే గృహ నిర్బంధాలు | - | Sakshi
Sakshi News home page

ఓటమి భయంతోనే గృహ నిర్బంధాలు

Oct 24 2026 9:26 AM | Updated on Oct 24 2026 9:26 AM

● విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి

బనగానపల్లె: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైఎస్సార్‌సీపీ నేతలను గృహ నిర్బంధం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల చివరి రోజు శుక్రవారం బనగానపల్లెలో మాజీ ఎమ్మెల్యేను పోలీసులు బయటికి వెళ్లకుండా గృహ నిర్బంధం చేశారు. ఈ మేరకు ఎస్‌ఐ దుగ్గిరెడ్డి నోటీసులు అందజేశారు. శుక్రవారం రాత్రి 9 గంటల వరకు ఎక్కడికి వెళ్లకుండా ఇంటి వద్దనే ఉండాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని మాట్లాడారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ప్రజలు ఎప్పుడూ ఇలాంటి అరాచక పాలనను చూడలేదన్నారు. పుంగనూరు, రాయచోటి ప్రాంతాల్లో పెట్రోల్‌ బాంబులు, కర్రలతో దాడులు చేయడం, వాహనాలు దహనం చేయడం దారుణమన్నారు. ఇలాంటి అరాచక పరిస్థితుల్లో ప్రశాంత వాతారణంలో ఎన్నికలు ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. టీడీపీ నేతలకు రాష్ట్ర ఎలక్షన్‌ కమిషనర్‌, పోలీసులు కొమ్ముకాస్తున్నట్లు విమర్శించారు. దౌర్జన్యంగా గెలిచిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు తగిన మూల్యం చెల్లిస్తారని హెచ్చరించారు. ఎన్నికల్లో పోలీస్‌ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ఒత్తసుపలకడం శోచనీయమన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా అధికారులు ధిక్కరించడం దారుణమన్నారు. ఇప్పటికై నా సుప్రీం కోర్టు ఆదేశాలు అమలు చేసి, నామినేషన్‌ వేస్తున్న వారికి రక్షణ కల్పించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement