పెచ్చుమీరిన ‘పచ్చ’మూకలు | - | Sakshi
Sakshi News home page

పెచ్చుమీరిన ‘పచ్చ’మూకలు

Oct 24 2026 9:26 AM | Updated on Oct 24 2026 9:26 AM

● వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై దాడి

● సాక్షి విలేకరి సెల్‌ఫోన్‌ లాక్కున్న వైనం

కొలిమిగుండ్ల: ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి చివరి రోజు శుక్రవారం కొలిమిగుండ్లలో నామినేషన్‌లు ప్రశాంతంగా జరుగుతున్న తరుణంలో ‘పచ్చ’మూకలు పెచ్చుమీరాయి. కనకాద్రిపల్లె స్థానానికి నామినేషన్‌ వేసేందుకు మహిళ వస్తుండగా అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు పోలీసులు ముందరే అభ్యర్థి చేతులోని పత్రాలను లాక్కున్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్త సుబ్బయ్యపై ఇష్టానుసారంగా దాడికి దిగారు. పోలీసులు ఓవైపు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నా ఏమాత్రం ఖాతరు చేయలేదు. చివరకు ఓ కానిస్టేబుల్‌పై దూసుకొచ్చి కొడతావా అంటూ బెదిరించారు.

ఉద్దేశపూర్వకంగానే గొడవ

నామినేషన్‌ కేంద్రం వద్ద ఉదయం నుంచి టీడీపీ నాయకులు ఉద్దేశపూర్వకంగానే గొడవకు దిగారు. వివిధ ఎంపీటీసీ స్థానాలకు టీడీపీ తరఫున నామినేషన్‌లు వేసినా ఊర్లకు వెళ్లకుండా అక్కడే మకాం వేశారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు వస్తే ముందుగానే వేసుకున్న పథకం ప్రకారం దాడికి సిద్ధమయ్యారు. ప్రశాంతంగా సాగిపోతున్న తరుణంలో ‘పచ్చ’నేతల కారణంగా నామినేషన్‌ కేంద్రం సమీపంలోని ప్రధాన రహదారి అల్లర్లకు వేదిక మారింది. రాక పోకలు సాగించే వాహనదారులు భయంతో ప్రయాణించాల్సి వచ్చింది. మోడల్‌ స్కూల్‌ నుంచి బస్సుల్లో ఇళ్లకు వెళ్లాల్సిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉమ్మాయిపల్లెకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు మొలక రాజారెడ్డి నామినేషన్‌ కేంద్రం నుంచి కారులో కార్యాలయానికి వెళుతుండగా ఆగిపోయింది. అక్కడే ఉన్న టీడీపీ నాయకుడు రాయితో దాడి చేయడంతో అద్దం ధ్వంసం అయ్యింది. గుంపులు చేరి హంగామా చేశారు. పోలీసులు చెప్పినా వినక పోవడంతో చివరకు కొద్ది సేపు లాఠీ ఛార్జ్‌ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

సాక్షి విలేకరి సెల్‌ లాక్కున్న పచ్చ మూకలు

నామినేషన్‌ కేంద్రం వద్ద టీడీపీ నాయకులు గొడవ సృష్టించారు. సహచర పాత్రికేయులతో కలిసి సాక్షి విలేకరి దృశ్యాలను తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తుండగా పచ్చమూకలు లాక్కొని దుర్భాషలకు దిగారు. ఇదేమని ప్రశ్నించగా బెదిరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement