నెల రోజుల బాబుతో గిరిజన మహిళ నామినేషన్‌ | - | Sakshi
Sakshi News home page

నెల రోజుల బాబుతో గిరిజన మహిళ నామినేషన్‌

Oct 24 2026 9:26 AM | Updated on Oct 24 2026 9:26 AM

మహానంది: నెల రోజుల బాబుతో గిరిజన మహిళ నామినేషన్‌ పులిచెర్ల వెంకటలక్ష్మీ శుక్రవారం ఎం.తిమ్మాపురంలో నామినేషన్‌ వేశారు. మహానంది మండలం గోపవరం ఎంపీటీసీ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వ్‌ అయింది. వైఎస్సార్‌సీపీ తరపున గాజులపల్లె రైల్వేస్టేషన్‌ గ్రామానికి చెందిన పులిచెర్ల వెంకటలక్ష్మీ నామినేషన్‌ వేసేందుకు వచ్చారు. కాగా.. ఆమె బాబుకు జన్మనిచ్చి కేవలం నెలరోజులే అయింది. గిరిజన కులానికి చెందిన వెంకటలక్ష్మీ బీకామ్‌ డిగ్రీ పూర్తి చేశారు. నెలరోజుల బాబును కలిగిన వెంకటలక్ష్మీని వైఎస్సార్‌సీపీ నాయకులైన న్యాయవాది డక్కా శరత్‌బాబు, బాలయ్యగౌడు, అనిల్‌బాబు, ఎమ్మె సుధాకర్‌లు ప్రత్యేకంగా కారులో తీసుకుని వచ్చి నామినేషన్‌ వేయించారు.

నామినేషన్‌ వేసేందుకు వెళ్తున్న వెంకటలక్ష్మీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement