సంజామలను కరువు మండలముగా ప్రకటించాలి.. | - | Sakshi
Sakshi News home page

సంజామలను కరువు మండలముగా ప్రకటించాలి..

Oct 3 2026 2:02 AM | Updated on Oct 3 2026 2:02 AM

సంజామలను కరువు మండలముగా ప్రకటించాలి.. కరువు జాబితాలో మా మండలం లేకపోవడం దారుణం

సాధారణ పరిస్థితుల పేరిట పక్కనపెట్టిన టీడీపీ ప్రభుత్వం

విస్మయాన్ని కలిగిస్తున్న చంద్రబాబు తీరు

ప్రభుత్వ కుట్రను ముందుగానే ప్రచురించిన ‘సాక్షి’

టీడీపీ నేతలు నోరు మెదపక కరువు రైతుకు అన్యాయం

బీమా ప్రీమియం రూపంలో రూ.కోట్ల నష్టం

గతేడాది నేను 8 ఎకరాలు మొక్కజొన్న, 4 ఎకరాలు వరి పంటను సాగు చేశాను. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులతో సాగు వైపు సాహసం చేయలేకపోయాను. సాగునీటి కాల్వలకు నీరు వదలక పోవడంతో కొందరు పంటలు వేసి నష్టపోయారు. ప్రభుత్వం స్పందించి సంజామల మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి ఆదుకోవాలి. –పేరం వెంకటేశ్వర్‌ రెడ్డి,రైతు ఆకుమల్ల గ్రామం

దేవనకొండలో ఎండిపోయిన వేరుశనగ పొలం

సీ బెళగల్‌లో నెర్రలిచ్చిన వరిపొలం

కర్నూలు(అగ్రికల్చర్‌): ఊహించినట్లుగా కరువు మండలాలను ప్రకటించడంలో చంద్రబాబు సర్కార్‌ వివక్ష చూపింది. ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల జాబితాలో తమ మండలాలకు స్థానం దక్కకపోవడం పట్ల రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో కేవలం 15 మండలాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా ప్రకటించే అవకాశం ఉందని ‘సాక్షి’లో గత సెప్టెంబర్‌ 23న ‘కరువును కప్పిపుచ్చే కుట్రలు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ అనుమానాలను నిజం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం యథావిధిగా ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలు జిల్లాలో 12 మండలాలు, నంద్యాల జిల్లాలో సంజామల మండలంలో కరువు విలయతాండవం చేస్తున్నా సాధారణ పరిస్థితులు ఉన్నాయని ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేసింది. ఉమ్మడి జిల్లాల్లోని అన్ని మండలాలను దిగుబడి లాస్‌ కింద కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని జిల్లా కలెక్టర్లు నివేదక పంపినప్పటికీ ప్రభుత్వం పెడచెవిన పెట్టడం గమనార్హం. ఈ విషయంలో టీడీపీ ప్రజాప్రతినిధులు నోరు మెదపకపోవడం రైతులకు శాపంగా మారుతోంది.

తాగడానికి నీళ్లు లేవు.. మేత కరువు

కర్నూలు జిల్లాలో 12, నంద్యాల జిల్లాలో ఒక మండలాన్ని కరువు మండలంగా గుర్తించకపోవడంతో రైతులు టీడీపీ ప్రజాప్రతినిధుల పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. నంద్యాల జిల్లాలో 26 మండలాలను తీవ్ర కరువు మండలాలుగా.. కొలిమిగుండ్ల, చాగలమర్రి మండలాలను మధ్యస్త కరువు మండలాలుగా గుర్తించింది. సంజామల మండలంలో సాధారణ పరిస్థితులు ఉన్నాయనే కారణంతో ప్రభుత్వం పక్కన పెట్టింది. వాస్తవంగా కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని అన్ని మండలాల్లో కరువు తీవ్రంగా ఉంది. తాగడానికి నీళ్లు లేవు, పశువులకు మేత కరువైంది. పంటల్లో దిగుబడులు 90 శాతం పైగా పడిపోయింది. అయినప్పటికీ కరువు మండలాలను గుర్తించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని చాటుకుంది.

బీమా ప్రీమియం మట్టిలోకి!

కూటమి ప్రభుత్వం కరువు రీత్యా అన్నదాతలు బీమా చేసుకోవాలని సూచించింది. ప్రభుత్వ మాటలు నమ్మి రైతులు బీమా ప్రీమియం చెల్లించారు. ఉమ్మడి జిల్లాల్లో రూ.200 కోట్ల మేర రైతన్నలు ప్రీమియం చెల్లించారు. కర్నూలు జిల్లాలో రూ.95.89 కోట్ల బీమా ప్రీమియం కట్టించుకున్నారు. ఈ పరిస్థితుల్లో కరువు మండలాలుగా ఎంపిక కాని ప్రాంతాల్లో రైతులు చెల్లించిన బీమా ప్రీమియం మట్టిలో కలిసినట్లేననే చర్చ జరుగుతోంది. ఇందుకు ప్రత్యక్షంగా ప్రభుత్వమే కారణమవుతోంది.

కరువు జాబితాలో ఆదోని మండలం–2 పేరు లేకపోవడం బాధ కలిగిస్తోంది. జూన్‌ నెల నుంచి ఇప్పటివరకు వర్షాలు లేకపోవడంతో దాదాపు నాలుగు ఎకరాల్లో సాగుచేసిన పత్తి పంట పూర్తిగా ఎండిపోయింది. పంటకు పెట్టుబడిన పెట్టుబడి రూ.1.20 లక్షలు మట్టిపాలయ్యింది. ఆదుకోవాల్సిన ప్రభుత్వం మా మండలానికి మొండిచేయి చూపడం దారుణం. – రాగప్ప, కడితోట గ్రామం, ఆదోని మండలం–2

71.4 మి.మీ లోటు వర్షపాతం ఉన్నా కరువు లేదట

జూన్‌ నుంచి ఆగస్టు వరకు పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించింది. ఆస్పరి మండలంలో సాధారణ వర్షపాతం 278.1 మిమీ ఉండగా.. 79.6 మి.మీ మాత్రమే నమోదైంది. 71.4 శాతం లోటు వర్షపాతం ఉంది. ఈ మండలంలో రెండు డ్రైస్పెల్‌లు ఉన్నాయి. దిగుబడి 75 శాతంపైగా పడిపోయింది. అయినప్పటికీ కరువు మండలంగా గుర్తించేందుకు ప్రభుత్వానికి మనసొప్పలేదు.

13 మండలాలకు

మొండిచేయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement