రూ.3 లక్షల నష్టం | - | Sakshi
Sakshi News home page

రూ.3 లక్షల నష్టం

Oct 3 2026 2:02 AM | Updated on Oct 3 2026 2:02 AM

రూ.3 లక్షల నష్టం అప్పులు చేసి పెట్టుబడులు 18 ఎకరాల్లో వరి పైరు మేతకు బంగారం తాకట్టు పెట్టి బీమా ప్రీమియం ●

ఖరీఫ్‌లో 10 ఎకరాల్లో పత్తి వేశాం. ఎకరాకు పెట్టుబడి రూ.30 వేల ప్రకారం రూ.3లక్షలు పెట్టినాం. దిగుబడి ఎకరాకు 20 కిలోలు కూడా లేదు. పెట్టుబడి రూ.3 లక్షల నష్టం. తాగడానికి నీళ్లు లేవు. పశువులకు మేత కరువైంది. దారుణమైన పరిస్థితులు ఉన్నా ఆస్పరి మండలాన్ని కరువు ప్రాంతంగా గుర్తించకపోవడం అన్యాయం.

– తలారి బజారప్ప, చిరుమానుదొడ్డి,

ఆస్పరి మండలం

నా సొంత పొలంతో పా టు ఆరు ఎకరాలు గుత్తకు(కౌలుకు) తీసుకుని పత్తి, వరి సాగు చేశాం. లక్ష రూపాయాలకు పైగానే అప్పులు చేసి పంటను నాటుకుంటే సరైన వానలు లేవు. చేతిలో చిల్లిగవ్వలేదు. ప్రభుత్వం కురువు మండలంగా ప్రకటించి ఆదుకుంటుందనుకుంటే ఇప్పుడు ఆ ఆశ కూడా లేకుండాపోయింది. అప్పులు ఎట్లా తీర్చాలో దిక్కుతోచకుంది.

– బలిగేరి వెంకటేష్‌, రైతు, సి.బెళగల్‌

వానల్లేక, నదిలో నీరు రాక 18 ఎకరాల్లో వరి పైరును జీవాలకు మేతగా వదిలేశా. ఎకరాకు రూ.20 వేలకుపైగా ఖర్చు పెట్టుకుని నష్టపోయా. ఇంతలా మా ప్రాంతంలో కరువున్నా ప్రభుత్వం కరువు మండలంగా ప్రకటించకపోవడం దారుణం. నష్టాల రైతును కాపాడాల్సిన ప్రభుత్వం ఇలా చేయడం బాధాకరం.

– విఠల్‌బాబు, చెట్నెహళ్లి,

మంత్రాలయం మండలం

ఖరీఫ్‌లో నేను పది ఎకరాల్లో పత్తి పంట సాగుచేశాను. వర్షం లేకపోవడంతో పంటంతా పోయింది. ఎకరాకు పత్తికి రూ.2 వేలు కడితే రూ.40 వేలు వస్తుంది అని కలెక్టర్‌, అధికారులు చెప్పారు. నా వద్ద డబ్బులు లేకపోవడంతో ఇంట్లో బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి ఇన్సూరెన్స్‌ చెల్లించాను. నేడు దేవనకొండ మండలం కరువు జాబితాలో లేకపోవడం చూస్తే దిక్కుతోచడం లేదు. – పరమేష్‌, కుంకనూరు రైతు,

దేవనకొండ మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement