కృష్ణగిరి: వర్షాలు కురిసి 15 రోజులు కావస్తున్నా పంటల్లో ఎలాంటి ఎదుగుదల లేకపోవడంతో రైతులు పంటలను తొలగిస్తున్నారు. మండల పరిధిలోని బాపనదొడ్డి గ్రామంలో శుక్రవారం గ్రామానికి చెందిన కృష్ణ ఐదు ఎకరాల్లో సాగు చేసిన ఆముదం పంటను ట్రాక్టర్‌తో దున్నేశారు. ఇదే రైతు గతేడాది తన పొలంలో లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి ఆరటి సాగు చేయగా పంట చేతికొచ్చే సరికి కేజీ రూ.5లకు అడగటంతో పంటను ఈ యేడాది మార్చి నెలలో తొలగించారు. అప్పులు మూట కట్టుకుని మే నెల చివరల్లో ఆముదం పంట సాగు చేస్తే ఇప్పుడు కూడా కోలుకోలేని విధంగా నష్టపోవడం గమనార్హం.


